ధరలు పతనమై దిగాలుపడుతున్న మిరప రైతులను కేంద్రం ఆదుకోవాలని రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు కోరారు. రాజ్యసభలో మిరప రైతుల కష్టాలను ప్రస్తావించిన ఆయన.. చైనాలో కరోనా ప్రభావం వల్ల తెలుగు రాష్ట్రాల నుంచి మిరప ఎగుమతులుు నిలిచిపోయాయని తెలిపారు. ఫలితంగా ధరలు పడిపయిిరైతులు నష్టపోతున్నారన్నారు. . ఈ తరుణంలో కేంద్రమే ఆదుకోవాలని కోరారు. దాదాపు 5వేల కోట్ల రూపాయల విలువైన తేజ రకం మిరప పంట తెలుగు రాష్ట్రాల నుంచి ఎగుమతి అవుతోందని వెల్లడించారు. ఇందులో 60శాతం చైనా దిగుమతి చేసుకుంటోందని... ప్రస్తుతం కరోనా విజృంభణ వల్ల ఆ దేశం దిగుమతులను ఆపేసిందని వివరించారు. ఫలితంగా ఏపీ, తెలంగాణలోని మిరప రైతులు తీవ్రంగా నష్ట పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.కేంద్ర ప్రభుత్వమే రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని విజ్ఞప్తి చేశారు. .
'కరోనా ప్రభావం నుంచి... మిర్చి రైతులను ఆదుకోండి' - మిర్చి రైతులకు కష్టాలు
కరోనా ప్రభావంతో నష్టపోతున్న మిర్చి రైతులను ఆదుకోవాలని కాంగ్రెస్ ఎంపీ కేవీపీ రామచంద్రరావు కోరారు. కరోనా కారణంగా మిర్చి ఎగుమతులు నిలిచిపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. ఈ విషయాన్ని ఆయన రాజ్యసభలో ప్రస్తావించారు.

ఇదీ చదవండి