పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపై రాజ్యసభ సభ్యులు కేవీపీ రామచంద్రారావు మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రాజెక్టు నిర్మాణానికి చేస్తున్న ఖర్చులో ఐదు వేల కోట్ల రూపాయలు కేంద్రం ఇవ్వాల్సి ఉందని... సవరించిన అంచనాలతో అందించిన ప్రాజెక్టు రిపోర్టును పరిగణనలోకి తీసుకోవాలని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. నిర్వాసితులకు పునరావాస ప్యాకేజీని వెంటనే పూర్తిస్థాయిలో అమలు చేయాలని కేవీపీ డిమాండ్ చేశారు. తద్వారా ప్రాజెక్టు నిర్మాణం త్వరితగతిన పూర్తయి... ఆంధ్రప్రదేశ్ ప్రజల కలలు నెరవేరినట్లు అవుందన్నారు. పోలవరం నిర్మాణానికి అవసరమైన నిధులు వెంటనే మంజూరు చేసి.. ప్రాజెక్టు పూర్తయ్యేందుకు సహకరించాలని సుబ్బిరామిరెడ్డి ఆర్థిక మంత్రిని కోరారు.
ఇదీ చదవండి: సింహం, నేనూ గడ్డం గీసుకోం..!: పవన్