ETV Bharat / city

black fungus: ముందే గుర్తిస్తే.. మందులతోనే నయం!

బ్లాక్ ఫంగస్ బాధితులకు కోఠిలోని ప్రభుత్వ ఈఎన్​టీ ఆస్పత్రి అండగా నిలుస్తోంది. 24 గంటలూ వైద్యులు పర్యవేక్షిస్తూ చికిత్స అందిస్తున్నారు. రోగులను కాపాడేందుకు పక్కా వ్యూహంతో సన్నద్ధమయ్యారు. బ్లాక్‌ ఫంగస్‌ను ముందుగానే గుర్తిస్తే మందులతోనే బయటపడవచ్చంటున్నారు వైద్యులు.

black fungus
black fungus
author img

By

Published : Jun 7, 2021, 11:32 AM IST

కొవిడ్‌ నుంచి కోలుకున్నా బ్లాక్‌ ఫంగస్‌ వెంటాడుతోంది. ముందుగానే గుర్తించకపోవడంతో ప్రమాదంలోకి నెట్టేస్తోంది. ఇలాంటి క్లిష్ట సమయంలో బ్లాక్‌ ఫంగస్‌ బాధితులకు హైదరాబాద్​లోని కోఠి ప్రభుత్వ ఈఎన్‌టీ ఆస్పత్రి భరోసానిస్తోంది. వైద్య నిపుణుల పర్యవేక్షణలో 24 గంటలూ రోగులకు వైద్య సేవలు అందిస్తోంది. లక్షలాది రూపాయలు ఖర్చు చేసినా అందని వైద్యాన్ని అక్కడి వైద్యులు ఉచితంగా అందిస్తున్నారు. ఈఎన్‌టీ, ఉస్మానియా, సరోజినీ దేవి కంటి ఆస్పత్రులు సమన్వయంతో రోగులకు వైద్యం అందిస్తున్నాయి.

10 రోజుల వ్యవధిలోనే 350 మందికి పైగా ఈ వ్యాధి బాధితులకు శస్త్రచికిత్సలు నిర్వహించి ఈఎన్‌టీ ఆస్పత్రి ఘనతను చాటుకుంది. బ్లాక్‌ ఫంగస్‌కు ఖరీదైన వైద్యం అవసరముండటంతో పేద, మధ్యతరగతి కుటుంబాలు ఎన్నో వ్యయప్రయాసలు ఎదుర్కోవాల్సి వచ్చింది. దీనికి పరిష్కారం చూపేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలతో గాంధీ, ఈఎన్‌టీ ఆస్పత్రుల్లో ఈ బాధితులకు వైద్యసేవలు ప్రారంభించారు.

కలసికట్టుగా కదిలారు

బ్లాక్‌ ఫంగస్‌ వైద్యం, శస్త్రచికిత్సలకు ప్రత్యేకంగా కోఠిలోని ఈఎన్‌టీ ప్రభుత్వ ఆస్పత్రిని కేటాయించారు. అక్కడ వైద్యులకు సహాయంగా ఉస్మానియా ఆస్పత్రి నుంచి 8 మంది వివిధ విభాగాల వైద్య నిపుణులను డిప్యూటేషన్‌పై పంపారు. కరోనా ఉద్ధృతితోపాటు బ్లాక్‌ ఫంగస్‌ జత కావడం వైద్యులకు సవాల్‌గా మారింది. దీన్ని అధిగమించేందుకు, రోగులను కాపాడేందుకు పక్కా వ్యూహంతో సన్నద్ధమయ్యారు.

ఈఎన్‌టీ ప్రభుత్వ ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ టి.శంకర్‌ నేతృత్వంలో ఊపిరితిత్తులు, దంత, నేత్ర, చెవి, ముక్కు, గొంతు వైద్య నిపుణులు, సాంకేతిక, పారిశుద్ధ్య, వైద్య సిబ్బంది కలిసికట్టుగా పనిచేశారు. డాక్టర్‌ ఉమా సారథ్యంలో అనస్థీషియా బృందం 24 గంటలూ శ్రమించారు. ప్రతిరోజూ 30-35 వరకు శస్త్రచికిత్సలు నిర్వహించారు. సుమారు 400 మందిని రెండోరోజే సరోజినీ దేవి కంటి ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఈఎన్‌టీలో 300 మందికి చికిత్స అందిస్తున్నట్టు డాక్టర్‌ మనీష్‌ గుప్త తెలిపారు. వైద్య నిపుణుల బృందాలను ప్రొఫెసర్లు డా.ఆనందాచార్య, డా.ఎల్‌.సుదర్శన్‌రెడ్డి, డా.టి.శంకర్‌, డా.సంపత్‌కుమార్‌ సింగ్‌లు సారథ్యం వహించారు.

భయపడొద్ధు

బ్లాక్‌ ఫంగస్‌ను ముందుగానే గుర్తిస్తే మందులతోనే బయటపడవచ్చంటున్నారు ఈఎన్‌టీ ప్రభుత్వ ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ టి.శంకర్‌. కరోనా సోకిన అందరిలోనూ సమస్య తలెత్తేదన్నారు. లక్షణాలు కనిపించగానే భయపడకుండా వెంటనే వైద్యులను సంప్రదించాలన్నారు. ఇతర ఆస్పత్రుల నుంచి వచ్చినవారు, అన్ని విభాగాల వైద్య నిపుణులు, సిబ్బంది సహకారంతోనే స్వల్ప వ్యవధిలోనే ఎక్కువ శస్త్రచికిత్సలు సాధ్యమయ్యాయని వివరించారు.

ఇదీ చదవండి:

'ఆ రాష్ట్రాల వల్లే టీకా పంపిణీలో మందగమనం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.