సీఎం జగన్‌పై కేసు ఉపసంహరణకు హైదరాబాద్‌లోని ప్రజాప్రతినిధుల కోర్టులో కోదాడ పోలీసులు పిటిషన్ వేశారు. ఎన్నికల నియమావళి ఉల్లంఘన కేసు ఉపసంహరణకు కోర్టు అనుమతి కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. అనుమతి లేకుండా ర్యాలీ నిర్వహించారని 2014లో జగన్‌పై కేసు నమోదు చేశారు. కోదాడ కోర్టులో ఏ-2, ఏ-3 నాగిరెడ్డి, వైవీ రత్నంబాబుపై కేసు వీగిపోయిందని పోలీసులు తెలిపారు. జగన్‌కు ఇంకా సమన్లు ఇవ్వలేదని పేర్కొన్నారు. ఫిర్యాదు చేసిన ఎంపీడీవో ఆళ్ల శ్రీనివాసరెడ్డి హాజరుకావాలని కోర్టు ఆదేశించింది. ఈనెల 17కు విచారణను వాయిదా పడింది.
ఇదీ చదవండి: రెండో దశ పంచాయతీ ఎన్నికల పోలింగ్ ఏర్పాట్లు పూర్తి: జీకే ద్వివేది