శాసనసభ మాజీ సభాపతి డాక్టర్ కోడెల శివప్రసాదరావు తనయుడు డాక్టర్ కోడెల శివరాం.. కెన్యా నుంచి గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. నిన్న తన తండ్రి ఆత్మహత్య వార్త తెలిసిన వెంటనే స్వస్థలానికి పయనమయ్యారు. ముందుగా.. ముంబాయి విమానాశ్రయానికి చేరుకుని అక్కడి నుంచి గన్నవరానికి వచ్చారు.
హైదరాబాద్ ఎన్టీఆర్ ట్రస్టు భవనం నుంచి రోడ్డు మార్గంలో గుంటూరులోని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యాలయానికి పార్దీవ దేహం వస్తుండడంతో గన్నవరం నుంచి శివరాం వెళ్లారు. కోడెల భౌతికకాయాన్ని సందర్శించిన అనంతరం అదే వాహన శ్రేణితో కలిసి గుంటూరు అక్కడి నుంచి నరసరావుపేట వెళ్తారని శివరాం అనుచరులు పేర్కొన్నారు. తమ కుటుంబం బాధలో ఉందని ఈ పరిస్థితుల్లో తానేం మాట్లాడలేనంటూ గన్నవరం విమానాశ్రయం వద్ద మీడియా ప్రతినిధుల ప్రశ్నలకు బదులివ్వకుండా బయలుదేరారు.
ఇదీ చూడండి: