పోలవరం పై కేంద్ర సంస్థలు వరుస సమావేశాలు ఏర్పాటు చేశాయి. ఈ ప్రాజెక్టును ఎప్పటిలోగా, ఎలా పూర్తి చేయనున్నారనే అంశంపై ప్రాజెక్టు అథారిటీ దృష్టి సారించింది. ఈ ప్రాజెక్టుకు అవసరమైన నిధుల మంజూరు విషయంలో డీపీఆర్ -2 ఆమోదానికి సంబంధించి సవరించిన అంచనాల కమిటీ కూడా సమావేశం ఏర్పాటు చేసింది. పోలవరంలో రూ. 55,548.87 కోట్లకు సవరించిన అంచనాల విషయంలో మరో అడుగు ముందుకు పడే అవకాశం ఉందని జలవనరుల శాఖ అధికారులు పేర్కొంటున్నారు. దిల్లీలో ఈ నెల 22న నిర్వహించే అంచనాల సవరణ కమిటీ సమావేశం కీలకం కానుంది. 2019 ఫిబ్రవరిలోనే డీపీఆర్- 2ను కేంద్ర జలవనరుల శాఖలోని సాంకేతిక సలహా కమిటీ ఆమోదించింది. అక్కడ్నుంచీ కేంద్ర ఆర్థిక శాఖకు ఈ డీపీఆర్ చేరుతుంది. కేంద్ర ఆర్థిక మంత్రి, అధికారులతో సంప్రదింపులు జరిపి అక్కడ కూడా ఆమోదం పొందితే ఈ ప్రక్రియ పూర్తవుతుంది. నాబార్డు ద్వారా ఎప్పుడు ఎంత మొత్తం విడుదల చేయాలనే ప్రణాళికకు కూడా కొత్త రూపు ఇవ్వనున్నారని సమాచారం. దిల్లీ సమావేశానికి ముందు రోజే ప్రాజెక్టు అథారిటీ ఈ నెల 21న హైదరాబాద్ లో సమావేశం ఏర్పాటు చేసింది. ఇందులో ప్రధానంగా ప్రాజెక్టును పూర్తి చేసేందుకు రాష్ట్ర జలవనరుల శాఖ వ్యూహాన్ని తెలుసుకోనుంది. తొలుత ఈ నెల 16న అనుకున్న సమావేశం వాయిదా పడింది. సమావేశంలో పునరావాసం, భూసేకరణపై కూడా చర్చించనున్నారు.
పోలవరం ప్రాజెక్టుపై కేంద్ర సంస్థల కీలక సమావేశాలు - పోలవరం అంచనాల కమిటీ భేటీ
ఈ నెల 22న దిల్లీలో పోలవరం అంచనాల సవరణ కమిటీ సమావేశం కానుంది. ఈ సమావేశానికి ముందు రోజే ప్రాజెక్టు అథారిటీ 21 న హైదరాబాద్ లో సమావేశం ఏర్పాటు చేసింది.
పోలవరం పై కేంద్ర సంస్థలు వరుస సమావేశాలు ఏర్పాటు చేశాయి. ఈ ప్రాజెక్టును ఎప్పటిలోగా, ఎలా పూర్తి చేయనున్నారనే అంశంపై ప్రాజెక్టు అథారిటీ దృష్టి సారించింది. ఈ ప్రాజెక్టుకు అవసరమైన నిధుల మంజూరు విషయంలో డీపీఆర్ -2 ఆమోదానికి సంబంధించి సవరించిన అంచనాల కమిటీ కూడా సమావేశం ఏర్పాటు చేసింది. పోలవరంలో రూ. 55,548.87 కోట్లకు సవరించిన అంచనాల విషయంలో మరో అడుగు ముందుకు పడే అవకాశం ఉందని జలవనరుల శాఖ అధికారులు పేర్కొంటున్నారు. దిల్లీలో ఈ నెల 22న నిర్వహించే అంచనాల సవరణ కమిటీ సమావేశం కీలకం కానుంది. 2019 ఫిబ్రవరిలోనే డీపీఆర్- 2ను కేంద్ర జలవనరుల శాఖలోని సాంకేతిక సలహా కమిటీ ఆమోదించింది. అక్కడ్నుంచీ కేంద్ర ఆర్థిక శాఖకు ఈ డీపీఆర్ చేరుతుంది. కేంద్ర ఆర్థిక మంత్రి, అధికారులతో సంప్రదింపులు జరిపి అక్కడ కూడా ఆమోదం పొందితే ఈ ప్రక్రియ పూర్తవుతుంది. నాబార్డు ద్వారా ఎప్పుడు ఎంత మొత్తం విడుదల చేయాలనే ప్రణాళికకు కూడా కొత్త రూపు ఇవ్వనున్నారని సమాచారం. దిల్లీ సమావేశానికి ముందు రోజే ప్రాజెక్టు అథారిటీ ఈ నెల 21న హైదరాబాద్ లో సమావేశం ఏర్పాటు చేసింది. ఇందులో ప్రధానంగా ప్రాజెక్టును పూర్తి చేసేందుకు రాష్ట్ర జలవనరుల శాఖ వ్యూహాన్ని తెలుసుకోనుంది. తొలుత ఈ నెల 16న అనుకున్న సమావేశం వాయిదా పడింది. సమావేశంలో పునరావాసం, భూసేకరణపై కూడా చర్చించనున్నారు.
polavarampolavarampolavaram
Conclusion: