ETV Bharat / city

భూ అక్రమాల్లో ముఖ్యమంత్రి హస్తం ఉంది: కన్నా లక్ష్మీనారాయణ - ap bjp

రాష్ట్రంలో నిర్మాణాలను పూర్తైయిన ఇళ్లను వెంటనే పేదలకు పంపిణీ చేయాలని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ డిమాండ్ చేశారు. పేదల ఇళ్ల నిర్మాణంలో భారీ అవినీతి జరిగిందన్న ఆయన... వీటిల్లో సీఎం హస్తం ఉందని ఆరోపించారు. గత ప్రభుత్వం ఇళ్ల నిర్మాణంలో అవినీతికి పాల్పడితే... ప్రస్తుతం ప్రభుత్వం ఇళ్ల స్థలాల పేరిట అవినీతి చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

kanna laxminaryana
kanna laxminaryana
author img

By

Published : Jul 22, 2020, 12:54 PM IST

వైకాపా ప్రభుత్వ వైఖరిపై భాజపా, జనసేన సంయుక్తంగా రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపట్టాయి. గుంటూరులోని తన ఇంట్లో భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ దీక్ష చేపట్టారు. నిర్మాణాలు పూర్తయిన ఇళ్లను పేదలకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. పేద ప్రజల పొట్ట గొట్టడంలో తెదేపాకు, వైకాపాకు ఏ మాత్రం తేడాలు లేవని ఆరోపించారు.

'పేదల ఇళ్ల నిర్మాణంలో భారీ అవినీతి జరిగింది. అప్పట్లో తెదేపా అవినీతిని ప్రశ్నించిన జగన్... తాను అధికారంలోకి వచ్చాక ఇళ్ల విషయం మర్చిపోయారు. నిర్మాణాలు పూర్తయిన లక్ష గృహాలను వెంటనే పేదలకు ఇవ్వాలి. 2.30 లక్షల గృహాల్లో పెండింగ్ పనులు ఉన్నాయి. పెండింగ్ నిర్మాణాలు పూర్తిచేసి వాటిని పేదలకు కేటాయించాలి. చాలామంది లబ్ధిదారులు తమ వాటా డబ్బు చెల్లించేందుకు అప్పులు చేశారు.కేంద్ర ప్రభుత్వం 4 వేల కోట్ల రూపాయలు తమ వాటా కింద గృహ నిర్మాణం కోసం ఇచ్చింది. గృహ నిర్మాణంలో అవినీతికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలి. పేదలకు ఇళ్ల స్థలాల పేరిట అధికార పార్టీ నేతలు అవినీతికి పాల్పడుతున్నారు. నెల్లూరు కలెక్టర్ శేషగిరిరావు వైకాపా ఎమ్మెల్యేల మాట వినలేదని బదిలీ చేశారు.' - కన్నా లక్ష్మీనారాయణ, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు

ఇదీ చదవండి:

నిమ్మగడ్డ వ్యవహారం: తొలగింపు నుంచి తిరిగి నియమించేదాకా....

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.