రాజధాని రైతుల దీక్షకు భాజపా నేత కామినేని శ్రీనివాస్ సంఘీభావం తెలిపారు. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు కేంద్ర నాయకత్వానికి త్వరలో తెలియజేస్తామని చెప్పారు. రాజధానిగా అమరావతిని కొనసాగించాలని రైతులు కోరడం న్యాయబద్ధమేనన్నారు. ఇది 29 గ్రామాల సమస్య కాదని రాష్ట్ర ప్రజల సమస్యగా భావించాలని చెప్పారు. ప్రభుత్వం ఇప్పటికైనా ప్రభుత్వం సానుకూలంగా ఆలోచించి.. అమరావతిని రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ చేశారు. నియంతృత్వం శ్రుతి మించితే వ్యవస్థలు చూస్తూ ఊరుకోవని ఆయన హెచ్చరించారు.
ఇదీ చూడండి: