ETV Bharat / city

రెరా ఛైర్మన్‌, సభ్యుల ఎంపిక కమిటీ ఛైర్మన్‌గా జస్టిస్‌ జోయ్‌ మల్య బాగ్చి

రాష్ట్ర రెరా ఛైర్మన్‌, సభ్యులు, అప్పిలేట్ ట్రైబ్యునల్​లో సభ్యుల ఎంపిక కమిటీ ఛైర్మన్‌గా.. జస్టిస్‌ జోయ్‌ మల్య బాగ్చి నియమితులయ్యారు. ఆ మేరకు ఆయనను నియమిస్తూ.. ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

justice joy malya bagchi as rera chairman
రెరా ఛైర్మన్‌, సభ్యుల ఎంపిక కమిటీ ఛైర్మన్‌గా జస్టిస్‌ జోయ్‌ మల్య బాగ్చి
author img

By

Published : Apr 8, 2021, 8:50 AM IST

రాష్ట్ర‌ స్థిరాస్తి వ్యాపార నియంత్రణ, ప్రాధికార సంస్థ (ఏపీ రెరా) ఛైర్మన్‌, సభ్యులు, అప్పిలేట్‌ ట్రైబ్యునల్‌లో సభ్యుల ఎంపిక కమిటీకి ఛైర్మన్‌గా.. హైకోర్టు జస్టిస్‌ జోయ్‌ మల్య బాగ్చిని నియమిస్తూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కమిటీలో సభ్యులుగా పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, న్యాయశాఖ కార్యదర్శి ఉంటారు. ఏపీ రెరా ఛైర్మన్‌గా ఉన్న వి.రామనాథ్‌ 65 ఏళ్లు పూర్తయినందున ఈ ఏడాది ఫిబ్రవరి 8న పదవీ విరమణ చేశారు. సభ్యులుగా చందు సాంబశివరావు, ముళ్లపూడి రేణుక కొనసాగుతున్నారు. ఏపీ రెరాలో మరో ముగ్గురు సభ్యుల స్థానాలు ఖాళీగా ఉన్నాయి. రెరా అప్పిలేట్‌ ట్రైబ్యునల్‌లోనూ మరో ముగ్గురు సభ్యుల స్థానాలను భర్తీ చేయాల్సి ఉంది. ఇందుకోసం ఎంపిక కమిటీని నియమిస్తూ పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీలక్ష్మి ఉత్తర్వులు జారీ చేశారు.

ఇదీ చదవండి:

పిల్లలతో సహా విషం తాగిన తల్లి.. కుమార్తె మృతి

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.