ఏపీ హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ అసనుద్దీన్ అమానుల్లా ఆదివారం ప్రమాణం చేయనున్నారు. ఆయనతో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఏకే గోస్వామి ఉదయం 10 గంటలకు ప్రమాణం చేయిస్తారు. పట్నా హైకోర్టులో న్యాయమూర్తిగా సేవలందిస్తున్న జస్టిస్ అసనుద్దీన్ అమానుల్లాను ఏపీ హైకోర్టుకు బదిలీ చేస్తూ సుప్రీంకోర్టు చేసిన సిఫారసుకు రాష్ట్రపతి ఇటీవల ఆమోదముద్ర వేసిన విషయం తెలిసిందే. ఆయన 1963 మే 11న జన్మించారు. 1991 సెప్టెంబరులో న్యాయవాదిగా పట్నా హైకోర్టులో ప్రాక్టీసు మొదలుపెట్టారు. సుప్రీంకోర్టు, దిల్లీ, కలకత్తా హైకోర్టుల్లో వాదనలు వినిపించారు. 2011 జూన్ 20న పట్నా హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. న్యాయవాదిగా ఉన్నప్పుడు పలు కేసుల్లో అమికస్ క్యూరీగా సేవలు అందించారు.
- ఇప్పటివరకు ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి(సీజే)గా సేవలు అందించి, బదిలీపై ఛత్తీస్‌గఢ్ హైకోర్టుకు సీజేగా వెళ్తున్న జస్టిస్ ఏకే గోస్వామికి ఆదివారం హైకోర్టులో వీడ్కోలు కార్యక్రమం నిర్వహించనున్నారు.
ఇదీచదవండి.