గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాల భర్తీపై ఉన్నతస్థాయి సమీక్ష జరిగింది. ఈ సమావేశంలో మంత్రులు పెద్దిరెడ్డి, బొత్స, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. సెప్టెంబర్ 20 నుంచి సచివాలయ ఉద్యోగాల భర్తీకి పరీక్షలు నిర్వహించనున్నట్టు మంత్రి బొత్స తెలిపారు. వారం రోజుల పాటు పరీక్షల నిర్వహణ ఉంటుందని మంత్రులు పెద్దిరెడ్డి, బొత్స స్పష్టం చేశారు.
10 లక్షల మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరవుతారని అంచనా వేస్తున్నామన్న మంత్రి పెద్దిరెడ్డి... తొలిరోజే 4.5 లక్షల మంది వరకు పరీక్షలు రాస్తారని పేర్కొన్నారు. ఖాళీలు ఉన్న పశుసంవర్ధక అసిస్టెంట్ పోస్టుల భర్తీపై దృష్టి సారించాలని మంత్రులు అధికారులకు సూచించారు. అత్యంత పారదర్శకంగా పరీక్షల నిర్వహణ ఉండాలని స్పష్టం చేశారు. ఈ విషయంపై సోమవారం కలెక్టర్లతో మంత్రులు, ఉన్నతాధికారుల వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు.
ఇదీ చదవండీ... పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీ మళ్లీ వాయిదా