ETV Bharat / city

హైకోర్టు సీజేగా జస్టిస్ జె.కె.మహేశ్వరి

ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ జె.కె. మహేశ్వరి నియమితులయ్యారు. ప్రస్తుతం ఆయన మధ్యప్రదేశ్​​ హైకోర్టులో సీనియర్ న్యాయమూర్తిగా పని చేస్తున్నారు.

author img

By

Published : Oct 3, 2019, 10:32 PM IST

Updated : Oct 4, 2019, 7:00 AM IST

ప్రధాన న్యాయమూర్తి

రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ జె.కె. మహేశ్వరి నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్రపతి రామ్​నాథ్ కోవింద్ ఉత్తర్వులు జారీ చేశారు. మధ్య ప్రదేశ్ హైకోర్టులో సీనియర్ న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ మహేశ్వరి... నవ్యాంధ్రలోని హైకోర్టుకు తొలి ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టనున్నారు.

మధ్యప్రదేశ్​కు చెందిన జస్టిస్ మహేశ్వరి 1961 జూన్ 29న జన్మించారు. 1985 నవంబరు 22న న్యాయవాదిగా ఎన్​రోల్ అయిన ఆయన... సివిల్, క్రిమినల్, రాజ్యాంగపరమైన కేసులను వాదించారు. మధ్యప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తిగా 2005 నవంబరు 25న నియమితులయ్యారు. తాజాగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్, సీనియర్ న్యాయమూర్తులు జస్టిస్ ఎస్ఏ బోబ్డే, జస్టిస్ ఎన్.వి.రమణతో కూడిన కొలీజియం సిఫార్సు మేరకు ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ జె.కె.మహేశ్వరి నియమితులయ్యారు.

Intro:కచ్చులూరు బోట్

Body:వెంకటరమణ

Conclusion:9490877172
Last Updated : Oct 4, 2019, 7:00 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.