ETV Bharat / city

కాంగ్రెస్‌ పార్టీకి రాసిపెట్టిన కాలం అయిపోయింది: జేసీ

author img

By

Published : Mar 16, 2021, 2:05 PM IST

Updated : Mar 16, 2021, 6:20 PM IST

తెలంగాణ.. సీఎల్పీ కార్యాలయంలో జేసీ దివాకర్‌రెడ్డి సరదా వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రాన్ని విభజించి కాంగ్రెస్‌ పార్టీకి నష్టం చేశారని వెల్లడించారు. సీఎం పదవి కోసం అధిష్ఠానంపై ఒత్తిడి తెచ్చారని తెలిపారు.

jc-diwakar-reddy
jc-diwakar-reddy

రాష్ట్రాన్ని విభజించి సోనియాగాంధీ తప్పు చేశారని తెదేపా నేత జేసీ దివాకర్​రెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీకి ఇక కాలం చెల్లిందంటూ జేసీ వ్యాఖ్యానించారు. రాయల తెలంగాణ ఏర్పాటుచేసి ఉంటే ఇబ్బంది ఉండేది కాదని జేసీ సహా కాంగ్రెస్ నేతలు అన్నట్లు సమాచారం. చంద్రబాబు తరహాలో జగన్​కు నోటీసులు ఇవ్వాల్సి వస్తే లారీల్లో రావాల్సి వస్తుందంటూ చురకలు అంటించారు. తెలంగాణలో షర్మిల.. రాజకీయాలు ప్రాక్టీసు చేస్తున్నారన్న ఆయన... ఏడాది, ఏడాదిన్నరలో ఆంధ్రాలో రాజన్న రాజ్యం కోసం పోరాడతారని జోస్యం చెప్పారు.

తెలంగాణ శాసనసభ ప్రాంగణానికి వచ్చిన జేసీ దివాకర్​రెడ్డి... కాంగ్రెస్ శాసన సభాపక్ష కార్యాలయంలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎమ్మెల్సీ జీవన్​రెడ్డి, ఎమ్మెల్యేలు పొడెం వీరయ్య, కోమటిరెడ్డి రాజగోపాల్​రెడ్డితో సరదాగా సంభాషించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసి సోనియా గాంధీ అందరికీ అన్యాయం చేశారని దివాకర్​రెడ్డి అన్నారు. రాష్ట్రాన్ని విభజించి కాంగ్రెస్​కు నష్టం చేశారన్న జేసీ.. విభజిస్తే పార్టీ తీవ్రంగా నష్టపోతుందని సోనియాకు చెప్పానన్నారు. కొందరు తెలంగాణ నేతలు ముఖ్యమంత్రి పదవి కోసం అధిష్ఠానంపై ఒత్తిడి తెచ్చారని చెప్పుకొచ్చారు. అయితే తాము ఎవరమూ ముఖ్యమంత్రి పదవులను ఆశించలేదని జీవన్​రెడ్డి, భట్టి విక్రమార్క అన్నారు.

కిరణ్​కుమార్​రెడ్డికి అదృష్టం కలిసివచ్చింది..

తాను కాంగ్రెస్ పార్టీలో జన్మించానన్న దివాకర్​రెడ్డి... తల్లిలాంటి కాంగ్రెస్​ పార్టీని ఇప్పుడు నిందించడం సరికాదన్నారు. కాంగ్రెస్​కు రాసిపెట్టిన కాలం అయిపోయిందని అభిప్రాయపడ్డారు. తమను ఇంతస్థాయికి పెంచిన కాంగ్రెస్​కు కాలం తీరడం బాధాకరమన్నారు.. జేసీ. జైపాల్ రెడ్డిని ముఖ్యమంత్రి కావాలని కోరితే ఆయన సుముఖత వ్యక్తం చేయలేదన్నారు. రాయల తెలంగాణ ఏర్పాటుచేసి ఉంటే ఇబ్బంది ఉండేది కాదని అభిప్రాయపడ్డారు. కిరణ్​కుమార్​రెడ్డికి అదృష్టం కలిసి వచ్చిందని.. అందుకే ముఖ్యమంత్రి అయ్యారని జేసీ వ్యాఖ్యానించారు.

జగన్​, షర్మిల మధ్య విభేదాలు!..

జగన్, షర్మిల మొండివారని.. వైఎస్ తనకు చెప్పేవారన్నారు జేసీ దివాకర్​రెడ్డి. అన్నాచెల్లెల్ల మధ్య విభేదాలు ఉన్నాయని తెలిపారు. షర్మిల ప్రస్తుతం తెలంగాణలో రాజకీయాల ప్రాక్టీసు చేస్తోందని... ఏడాది, ఏడాదిన్నర తర్వాత తన రాజకీయాన్ని ఏపీకి మారుస్తుందని జోస్యం చెప్పారు. ఏపీలోనూ రాజన్న రాజ్యం లేదని షర్మిల రాజకీయం చేస్తుందని, అప్పుడు కేంద్రంలోని భాజపా నేతలు ఏం చేస్తారో చూడాలన్నారు. షర్మిల రాజకీయం చేయాలని చూస్తే తెలంగాణ ప్రజలు పిచ్చివాళ్లా అని ప్రశ్నించిన జేసీ.... ఆమెకు ఐదు శాతం ఓట్లు వస్తే గొప్పా అని అభిప్రాయపడ్డారు.

జగన్​ కోసం లారీల్లో నోటీసులు..

జగన్ మనస్తత్వం ప్రకారం చంద్రబాబుపై ఎప్పుడో కేసులు పెట్టాల్సి ఉండేదని, తమ వీపులు వాయించినపుడే వాళ్ల వీపులూ వాయించాల్సి ఉండేదని జేసీ అన్నారు. ఎందుకు ఆలస్యం అయిందో జగనే చెప్పాలన్నారు. చంద్రబాబునాయుడుకు ఒక్క పోలీస్ అధికారి వచ్చి నోటీసు ఇచ్చారన్న దివాకర్​రెడ్డి.. ఏపీ సీఎం జగన్, విజయసాయిరెడ్డికి నోటీసులు ఇవ్వాల్సి వస్తే లారీలో తీసుకురావాల్సి వస్తుందని ఎద్దేవా చేశారు.

వైజాగ్​ భూములన్నీ విజయసాయిరెడ్డి చేతుల్లోనే!

అమరావతి భూములు ఎక్కడికి పోలేదని... వైజాగ్​ భూములన్నీ విజయసాయిరెడ్డి చేతుల్లో ఉన్నాయని అక్కడ సముద్రం, బీచ్ తప్ప ఏమీ మిగల్లేదని ఆరోపించారు. జగన్ జైలుకు వెళ్లే అవకాశాలు కనిపించడం లేదని చెప్పారు.

కాంగ్రెస్​ పని అయిపోయింది!

తెలంగాణలో కాంగ్రెస్ నేతలు పోరాడుతున్నారని, అయితే వాళ్ల పోరాటం ఫలించే పరిస్థితి కనిపించడం లేదన్నారు... జేసీ దివాకర్​రెడ్డి. రెండు, రెండున్నరేళ్లలో కాంగ్రెస్ పూర్తిగా తుడుచుపెట్టుకుపోతుందని అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో.. తెరాస, వైకాపా కాలం నడుస్తోందని తెలిపారు. ఎన్నాళ్లు ఉంటుందో చూద్దామన్నారు.

తెదేపా- భాజపా కలిసి పనిచేస్తేనే..

'సేవ్ తాడిపత్రి' నినాదంతో తమ అభ్యర్థులు ఎన్నికల్లో విజయం సాధించారని జేసీ చెప్పారు. తన సోదరునికే పూర్తి క్రెడిట్ దక్కుతుందన్నారు. ప్రాంతీయ పార్టీలు ఉంటే కుటుంబపాలనే ఉంటుందన్న ఆయన... దేశానికి జాతీయ పార్టీలే అవసరమని వ్యాఖ్యానించారు. తాను గత్యంతరం లేకే తెలుగుదేశం పార్టీలో ఉన్నానని చెప్పారు. ఏపీలో తెలుగుదేశం, భాజపా కలిసి పనిచేస్తేనే రెండింటికి మంచిదని అభిప్రాయపడ్డ జేసీ.. భాజపా సాయం లేకపోతే పది సీట్లు కూడా రావని అన్నారు.

తెలంగాణ పాలన కంటే ఆంధ్రాలో పాలన మరింత దుర్మార్గంగా ఉందని దివాకర్ రెడ్డి వ్యాఖ్యానించారు. కేసీఆర్ పాలన బాగుందని మాత్రం చెప్పడం లేదని స్పష్టతనిచ్చారు.

రాయల తెలంగాణకు వారు అంగీకరించలేదు..

తెలంగాణలో 2023 ఎన్నికల్లో కాంగ్రెస్​దే అధికారమన్న సీఎల్పీ నేత మల్లు భట్టివిక్రమార్క... అందుకు పాత కాంగ్రెస్ నేతలు, పెద్దవాళ్లంతా సహకరించాలని కోరారు. తెలంగాణ వచ్చినందుకు ఓ వైపు ప్రజలు సంతోషంగా ఉన్నారని, మరోవైపు బాధగా కూడా ఉన్నారని.. ఎమ్మెల్యే రాజగోపాల్​రెడ్డి అన్నారు. కర్నూల్, అనంతపురం కలిపి రాయల తెలంగాణ ఏర్పాటు చేయాలని కోరితే కొందరు తెలంగాణ నేతలు అంగీకరించలేదని వ్యాఖ్యానించారు.

జగన్​కు చెక్​ పెట్టేందుకే..

వైఎస్​ మరణించాక తెలంగాణ వ్యక్తిని లేదా జగన్​ను ముఖ్యమంత్రి చేయాల్సి ఉండేదని రాజగోపాల్​రెడ్డి అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ నాయకత్వాన్ని ఎదగనీయలేదన్న ఆయన... ఉద్దేశపూర్వకంగా ఆరుగురు తెలంగాణ మహిళలకు మంత్రి పదవులు ఇచ్చారన్నారు. ఆంధ్రా నేతలు అన్యాయం చేసినందువల్లే.. తెలంగాణ కోసం పోరాడారన్నారు. కేంద్ర మంత్రి పదవిని తీసుకొనేందుకు జగన్​ అంగీకరించాక కూడా ఆయనకు చెక్ పెట్టేందుకే కిరణ్​కుమార్​రెడ్డిని ముఖ్యమంత్రిగా చేశారని రాజగోపాల్​రెడ్డి అన్నారు.

తెరాసలో ఎప్పుడో చేరేవాడిని..

తాను ఏ పార్టీల్లో ఉన్నా కేసీఆర్​ను గద్దె దించేవరకు పోరాడతానని స్పష్టం చేశారు. ఈ విషయంలో తన పంథాను గతంలోనే వెల్లడించానన్నారు. తనకు ప్రాజెక్టులు, డబ్బులు కావాలంటే తెరాసలో ఎప్పుడో చేరే వాడినని రాజగోపాల్​రెడ్డి వ్యాఖ్యానించారు.

చంద్రబాబే కారణం!

తెలంగాణ ఏర్పాటు ఫలాలు అందడం లేదన్న బాధ ప్రజలకూ ఉందన్న కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్​రెడ్డి... జేసీ లాంటి వాళ్లూ కాంగ్రెస్​ను వదిలిపెట్టి పోయారని వ్యాఖ్యానించారు. దూరపు కొండలు నునుపు తరహాలో.. తెలంగాణలో పాలన బాగా ఉందని జేసీ లాంటి వారు భావిస్తున్నారని జీవన్​రెడ్డి అన్నారు. ఇప్పుడున్న రాజకీయ సమస్యలన్నింటికీ చంద్రబాబు నాయుడే కారణమన్న జీవన్​రెడ్డి... కేసీఆర్​ను ఆనాడే మంత్రి వర్గంలోకి తీసుకుని ఉంటే సమస్య ఉండేదని కాదని అభిప్రాయపడ్డారు. అప్పటి తప్పులకు చంద్రబాబు ఇప్పుడు శిక్ష అనుభవిస్తున్నారని వ్యాఖ్యానించారు. రాయల తెలంగాణ ఏర్పాటు చేసి ఉంటే అన్ని రకాలుగా బాగుండేదని జీవన్​రెడ్డి అభిప్రాయపడ్డారు

ఇదీ చదవండి: అట్రాసిటీ కేసు పెట్టే పరిస్థితికి దిగజారిపోయారు: లోకేశ్‌

Last Updated : Mar 16, 2021, 6:20 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.