IT Raids on Phoenix: స్థిరాస్థి, మౌలిక సదుపాయాల కల్పన సంస్థ ఫీనీక్స్ కంపెనీపై ఆదాయపన్ను శాఖ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఆ సంస్థ ఛైర్మన్ చుక్కపల్లి సురేశ్, ఆయన తనయుడు అవినాష్, సంస్థ డైరెక్టర్ల ఇళ్లు, కార్యాలయాలు కలిపి మొత్తం 20 చోట్లలో ఏక కాలంలో తనిఖీలు చేస్తున్నారు. ఆదాయపు పన్ను చెల్లింపుల్లో తేడా ఉందన్న ఆరోపణల నేపథ్యంలో దాడులు నిర్వహిస్తున్నారు. జంటనగరాల్లో ఈరోజు ఉదయం ఐదు గంటల నుంచి ఈ సోదాలు సాగుతున్నాయి.
జూబ్లిహిల్స్‌లోని ప్రధాన కార్యాలయం, మాదాపూర్‌లోని ఫీనిక్స్ ఐటీ సెజ్, నానక్‌రాం గూడలోని గోల్ఫ్ ఎడ్జ్ గేటెడ్ కమ్యూనిటీలో డైరెక్టర్ల నివాసాలు, కార్యలయాల్లో అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. నగరంలోని ఐటీ అధికారులతో పాటు దిల్లీ నుంచి వచ్చిన ప్రత్యేక బృందాలతో సహా మొత్తం 30 బృందాలు ఈ దాడుల్లో పాల్గొన్నాయి. పన్ను ఎగవేత ఆరోపణలపై సోదాలు చేస్తున్నట్లు సమాచారం. ్సంస్థ ఆదాయం, పన్ను చెల్లింపుల్లో వ్యత్యాసం ఉన్నట్లు అధికారులు గుర్తించినట్టు తెలుస్తోంది.