ETV Bharat / city

జమాత్​ ప్రార్థనలు.. నిఘా వర్గాల చేతికి నివేదిక - జమాత్​ ప్రార్థనలపై తెలంగాణ పోలీసులు నివేదిక

దిల్లీలో తబ్లీగీ జమాత్ ప్రార్థనల్లో పాల్గొని హైదరాబాద్‌ వచ్చిన వారిలో కొందరి ద్వారా కరోనా వైరస్ సోకిన తరుణంలో ఆ అంశంపై లోతుగా దర్యాప్తు చేసి నివేదిక సమర్పించాలని రాష్ట్ర పోలీసులను కేంద్రం ఆదేశించింది. వారం పాటు విచారణ చేసి పోలీసులు విదేశీయులు ఇక్కడకి వచ్చేనాటికే వారిలో కరోనా లక్షణాలు గుర్తించారు.

investigation report on jamath prayers
investigation report on jamath prayers
author img

By

Published : Apr 12, 2020, 11:28 AM IST

దిల్లీలోని హజరత్ నిజాముద్దీన్‌లో తబ్లీగీ జమాత్ ప్రార్థనల్లో పాల్గొని రాష్ట్రానికి వచ్చిన విదేశీయులపై పోలీసులు ఆరా తీశారు. విదేశాల్లో కరోనా వైరస్ తీవ్ర ప్రభావం చూపుతున్నప్పుడే.. ఇరాన్, ఇండోనేషియా, కజికిస్థాన్, మలేషియా, థాయిలాండ్, సూడాన్, అల్జీరియా, బంగ్లాదేశ్ నుంచి బృందాలవారీగా విదేశీయులు ప్రార్థనలకు హాజరైనట్లు నిర్ధరించారు. వారిలో 64 మంది విదేశీయులుండగా వారికి సాయంగా ఏడుగురు వచ్చినట్లు గుర్తించారు. మొత్తం 64 మంది విదేశీయులు, మరో ఏడుగురిపై సుమోటోగా విచారించి కేసులు నమోదుచేశారు.

నిజాముద్దీన్‌లో తబ్లీగీ జమాత్ నిర్వాహకులు జనవరి చివరి వారంలో ప్రార్థనలు ప్రారంభించారు. ఫిబ్రవరి రెండో వారం నుంచి యువకులు, వృద్ధులు దశలవారీగా వచ్చారు. వారిలో 64 మంది ఫిబ్రవరి 29, మార్చి 1న నాలుగు బృందాలుగా వచ్చారు. అందులో 8 మంది ఇరానీయన్లు ఫిబ్రవరి 29 నుంచి మార్చి 18 వరకు హైదరాబాద్‌లోని వేర్వేరు ప్రార్థనా మందిరాల్లో బసచేశారు. నల్లగుట్టలో ఆశ్రయం పొందారు.

రెండో బృందంగా వచ్చిన 40 మంది విదేశీయులు ఫిబ్రవరి 21న దేశీయ విమాన సర్వీసుల ద్వారా భాగ్యనగరానికి వచ్చారు. అప్పటి నుంచి మార్చి19 వరకు మలక్‌పేట, టోలీచౌక్​, మల్లేపల్లి, పంజాగుట్ట, రియాసత్‌నగర్‌లోని ప్రార్థనా మందిరాలు, స్థానికుల ఇళ్లల్లో ఆశ్రయం పొందారు.

మూడు, నాలుగు బృందాలుగా వచ్చిన 16 మంది.. ఆసిఫ్‌నగర్, హబీబ్‌నగర్, మల్లేపల్లిలో ప్రార్థనలు నిర్వహించారు. జమాతే ప్రార్థనల్లో పాల్గొనేందుకు వచ్చిన ఇరాన్, ఇండోనేషియా వాసుల్లో కొందరికి ఇక్కడకి వచ్చే నాటికే కరోనా లక్షణాలున్నట్లు వైద్యులతో పరీక్షలు చేయించినప్పుడు పోలీసులు గుర్తించారు.

నల్లగుట్టలోని ఓ ప్రార్థన మందిరంలోని ఇరానీయుల్లో ఇద్దరికి, పాతమలక్‌పేట మసీద్‌లో ముగ్గురు ఇండోనేషియా వాసుల్లో వైరస్‌ లక్షణాలు గుర్తించిన వెంటనే గాంధీ ఆస్పత్రికి తరలించారు. విదేశీయులతో కలిసి మెలిసి ఉండటం, వసతి కల్పించిన స్థానికి తబ్లీగీ జమాత్ నేతకు వైరస్ సోకి మృతి చెందాడని పోలీసులు తెలిపారు. విచారణలో సేకరించిన పూర్తి వివరాలతో.. సమగ్ర నివేదికను కేంద్ర హోంశాఖ, నిఘా వర్గాలకు పంపారు.

ఇవీచూడండి: 'ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణకు నూతన విధానాలు కావాలి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.