అంబులెన్సుల నిలిపివేతపై తెలంగాణ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ మార్గదర్శకాలపై స్టే విధించింది. తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు ఆదేశాలు అమల్లో ఉంటాయని టీఎస్ హైకోర్టు స్పష్టం చేసింది. అంబులెన్సులను నియంత్రించేలా ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వొద్దని ఆదేశించింది. అంబులెన్సులను అడ్డుకునేందుకు మరో రూపంలో ప్రభుత్వం ప్రయత్నించవద్దని స్పష్టం చేసింది.
ఆస్పత్రుల్లో చేరేందుకు కంట్రోల్‌రూమ్ అనుమతి అక్కర్లేదని తెలంగాణ ఉన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. ప్రజలు కోరుకుంటే కంట్రోల్‌రూమ్‌కు ఫోన్ చేయవచ్చని... ఫోన్ చేసినవారికి కంట్రోల్‌రూమ్ సహకరించాలని ఆదేశించింది. 2 వారాల్లోగా కౌంటర్లు దాఖలు చేయాలని తెలంగాణ, ఏపీ, కేంద్రానికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణ జూన్ 17కు వాయిదా వేసింది.
ఇదీ చదవండీ... అంబులెన్సులు ఆపే హక్కు ఎవరిచ్చారు?: టీఎస్ హైకోర్టు