ఇంటర్మీడియట్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు సెప్టెంబరు 15 నుంచి 23 వరకు నిర్వహించనున్నట్లు ఇంటర్ విద్యామండలి కార్యదర్శి రామకృష్ణ తెలిపారు. మొదటి ఏడాది విద్యార్థులకు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు.. ద్వితీయ సంవత్సరం వారికి మధ్యాహ్నం రెండున్నర గంటల నుంచి సాయంత్రం ఐదున్నర గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తారు. ప్రాక్టికల్ పరీక్షలు అక్టోబరు 4 నుంచి 7వరకు రెండు విడతల్లో జరుగుతాయి. మార్చిలో పరీక్ష రుసుము చెల్లించని విద్యార్థులు.. హాజరు మినహాయింపు పొందే ప్రైవేటు అభ్యర్థులు ఈనెల 17లోగా చెల్లించాలని రామకృష్ణ తెలిపారు.
పరీక్షల షెడ్యూల్ ఇలా..
- సెప్టెంబరు 15 రెండో భాష-1,2
- సెప్టెంబరు16 ఆంగ్లం-1,2
- సెప్టెంబరు17 గణితం-1ఏ, 2ఏ
వృక్షశాస్త్రం-1,2
పౌరశాస్త్రం-1,2 - సెప్టెంబరు18 గణితం-1బీ, 2బీ
జంతుశాస్త్రం-1,2
చరిత్ర-1,2 - సెప్టెంబరు20 భౌతికశాస్త్రం-1,2
ఆర్థికశాస్త్రం-1,2 - సెప్టెంబరు21 రసాయనశాస్త్రం-1,2
కామర్స్-1,2
సోషియాలజీ-1,2
ఫైన్ ఆర్ట్స్, మ్యూజిక్-1,2 - సెప్టెంబరు22 పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్-1,2
లాజిక్-1,2 : బ్రిడ్జి కోర్సు గణితం-1, 2 - సెప్టెంబరు23 మోడ్రన్ లాంగ్వేజ్-1,2
జాగ్రఫీ-1,2
ఇదీ చదవండీ.. CHEATING: చీటీలు, డిపాజిట్ల పేరుతో మోసం..లబోదిబోమంటున్న బాధితులు