కొవిడ్ వ్యాప్తి నేపథ్యంలో తెలంగాణలోని పాఠశాలలకు వేసవి సెలవులు పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. జూన్ 15 వరకు వేసవి సెలవులు పొడిస్తున్నట్లు విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. జూన్ 15 వరకూ డైట్ కళాశాలలకు కూడా సెలవులు పొడిగిస్తున్నట్లు విద్యాశాఖ సంచాలకురాలు శ్రీదేవసేన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు, పీఆర్టీయూటీఎస్ నేతలు ఇవాళ విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డితో సమావేశమై చర్చించారు. కరోనా తీవ్రత, లాక్డౌన్ పొడిగింపు కారణంగా పాఠశాలలు, ఇంటర్ కాలేజీలకు సెలవులు కనీసం రెండు వారాలు పొడిగించాలని కోరారు. ఫలితంగా రేపు ప్రారంభం కావల్సిన ఇంటర్ మొదటి, రెండో సంవత్సరం ఆన్‌లైన్ తరగతులు వాయిదాపడ్డాయి.
ఇదీ చదవండి: రాష్టంలో పెరుగుతున్న బ్లాక్ ఫంగస్ కేసులు.. వెలుగులోకి ఆసక్తికర విషయాలు