ETV Bharat / city

IVF: మాతృత్వానికి మరో దారి... ఐఐటీహెచ్​ ఆవిష్కరణతో మరింత సులభం - AMARAVATI NEWS

మారిన జీవన విధానం, అధికంగా రేడియేషన్ విడుదల చేసే సాంకేతిక పరికరాల వినియోగం, ఆలస్యంగా వివాహం చేసుకోవడం.. కారణమేదైనా ప్రపంచ వ్యాప్తంగా నేటి యువత ఎదుర్కొంటున్న సమస్యల్లో సంతానలేమి ఒకటి. కృత్రిమ విధానంలో సంతానం పొందడానికి అనేక పద్ధతులు అందుబాటులో ఉన్నా.. కొన్నిసార్లు వాటి సాఫల్యత కూడా ప్రశ్నార్థకమే. కృత్రిమ పద్ధతిలో మరింత కచ్చితత్వం పెంచేలా ఐఐటీ హైదరాబాద్ పరిశోధకులు వినూత్న ఆవిష్కరణ చేశారు.

మాతృత్వానికి మరో దారి
మాతృత్వానికి మరో దారి
author img

By

Published : Aug 20, 2021, 7:41 PM IST

మాతృత్వానికి మరో దారి... ఐఐటీహెచ్​ ఆవిష్కరణతో మరింత సులభం

పెళ్లైన నాటి నుంచి దంపతులు ఎప్పుడెప్పుడు తల్లిదండ్రులం అవుతామా.. ఎప్పుడెప్పుడు అమ్మా నాన్న అని పిలిపించుకుంటామా అని ఆశగా ఎదురుచుస్తుంటారు. కానీ ఈ ఆశా అందరికీ అంత సులువుగా నెరవేరదు. కొందరు ఏళ్ల తరబడి మాతృత్వ మధురానుభూతి కోసం ఎదురుచూడాల్సి వస్తుంది. ఇటువంటి వారి సంఖ్య ప్రపంచ వ్యాప్తంగా సుమారు 5 కోట్ల మంది దంపతులు ఉన్నారని ఓ అంచనా. వీర్య కణాల్లో సరైన వేగం లేకపోవడం.. వీరికి పిల్లలు పుట్టకపోవడానికి గల కారణాల్లో ముఖ్యమైనది.

సరికొత్త మూలకం..

ఇటువంటి వారు ఐవీఎఫ్ వంటి కృత్రిమ గర్భధారణ విధానాలను ఆశ్రయిస్తున్నారు. ఈ ఐవీఎఫ్ విధానంలో శుక్రకణాలు.. పిండంతో కలిసి ఫలదీకరణ చెందేలా చేయడానికి పెంటోక్జ్సైఫైలిన్‌​ (Pentoxifylline) అనే రసాయన మూలకాన్ని వినియోగిస్తున్నారు. ఐతే ఈ రసాయనం కొన్ని సందర్భాల్లో పిండంపై చెడు ప్రభావం సైతం చూపుతోంది. అన్నీ సార్లు ఆశించిన స్థాయిలో పనితీరు కనబరచడం లేదు. ఈ సమస్యను గుర్తించిన ఐఐటీ హైదరాబాద్​లోని బయోటెక్నాలజీ డిపార్ట్​మెంట్ పరిశోధకులు మణిపాల్ విశ్వవిద్యాలయంలోని కస్తూర్బా వైద్య కళాశాల, మంగళూర్ విశ్వవిద్యాలయం పరిశోధకులతో కలిసి ఎంపీటీఎఫ్ అనే మూలకాన్ని సంయుక్తంగా ఆవిష్కరించారు.

అద్భుత ఆవిష్కరణ..

ఐవీఎఫ్ విధానంలో పెంటోక్జ్సైఫైలిన్‌​ బదులు ఎంపీటీఎఫ్​ను వాడటం వల్ల వీర్య కణాలు మరింత చురుకుగా మారాయి. ఫలధీకరణ సామర్థ్యం సైతం పెరిగింది. పిండంపై ఎలాంటి విషపూరిత ప్రభావాలు, డీఎన్ఏ లోపాలు లేకపోవడం దీని మరో ప్రత్యేకత. ఈ వివరాలు ఇటీవల నేచర్ సైంటిఫిక్ రిపోర్ట్స్ అనే జర్నల్​లో ప్రచురితమయ్యాయి.

ఇదీ చదవండి:

kala venkatarao: '56 కార్పొరేషన్లంటున్నారు.. బడ్జెట్ కేటాయింపులపై మాట్లాడరేం'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.