ETV Bharat / city

'ఐకాస తలపెట్టిన అసెంబ్లీ ముట్టడికి అనుమతి లేదు'

ఈనెల 20న ఐకాస తలపెట్టిన అసెంబ్లీ ముట్టడికి అనుమతి లేదని ఐజీ వినీత్ బ్రిజ్‌లాల్‌  తెలిపారు. రాజధానిలో సెక్షన్ 30 పోలీస్ చట్టం, సెక్షన్ 144 అమల్లో ఉన్నాయని గుర్తు చేశారు.

ig-brijlal-about-assembly-obsession
ig-brijlal-about-assembly-obsession
author img

By

Published : Jan 18, 2020, 9:06 PM IST

అమరావతి విషయంలో.. ఐక్య కార్యాచరణ సమితి ఈ నెల 20న తలపెట్టిన అసెంబ్లీ ముట్టడికి ఎలాంటి అనుమతి లేదని ఐజీ బ్రిజ్​లాల్ తెలిపారు. 'ఎల్లుండి మంత్రి మండలి భేటీ, అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయి. అసెంబ్లీ కార్యక్రమాలు, ఉద్యోగుల విధులకు ఆటంకం కలుగుతుంది. ముట్టడి కార్యక్రమాలకు ఎవరూ హాజరుకావొద్దు. రాజధాని గ్రామాలకు కొత్తవారిని అనుమతించవద్దు. వారు ఏదైనా చట్ట విరుద్ధమైన కార్యక్రమాలకు పాల్పడే అవకాశం ఉంది. ఇతరులకు ఆశ్రయం ఇచ్చిన వారిపై చట్ట ప్రకారం చర్యలు ఉంటాయి. వాహనాలు, వసతులు సమకూర్చిన వారిపైనా చర్యలు తీసుకుంటాంటాం' అని ఐజీ హెచ్చరించారు.

ఇదీ చదవండి:

రైతులకు పోలీసుల ముందస్తు నోటీసులు

Intro:గుంటూరు జిల్లా చిలకలూరిపేట మండలం రామచంద్రపురం వద్ద శనివారం ఉదయం అంతులేని విషాదం చోటుచేసుకుంది 16వ నెంబర్ జాతీయ రహదారి పక్కన భారత్ పెట్రోల్ బంక్ లో విద్యుత్ ఘాతానికి గురై ముగ్గురు సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు

Body:గుంటూరు జిల్లా చిలకలూరిపేట మండలం రామచంద్రాపురం గ్రామపరిధిలో పరిధిలో 16వ నంబరు జాతీయ రహదారి పక్కన ఉన్న పెట్రోల్ బంకులో విద్యుత్ ఘాతానికి గురై ముగ్గురు మృత్యువాత పడ్డారు... దీనికి సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి ...శనివారం ఉదయం 11 గంటల సమయంలో పెట్రోల్ బంక్ ఆవరణలోని స్తంభానికి ఉన్న విద్యుత్ బల్బు కాలిపోవడంతో దానిని మార్చడానికి చక్రాలతో ఉన్న పెద్ద బస్టాండ్ సిబ్బంది ఏర్పాటు చేసుకున్నారు... అది నేరుగా స్తంభానికి సరిపోకపోవడంతో దాని పక్కనే ఉన్న లక్కీ రోడ్ లైన్ కార్యాలయం పైకి తీసుకు వెళ్లి పెట్టాలని సిబ్బంది ఆలోచించారు... ఈ క్రమంలో తీసుకెళ్తుండగా అది బరువుగా ఉండడంతో ఒరిగిపోయి సమీపంలో ఉన్న విద్యుత్ 11 కెవి లైన్ తీగలపై పడింది... అంతే ఘోరం జరిగిపోయింది... దానిని పట్టుకుని ఉన్న ముగ్గురు సిబ్బంది విద్యుదాఘాతానికి గురయ్యారు.. అందులో చిలకలూరిపేట మండలం బొప్పూడి గ్రామానికి చెందిన కారుచోల మౌలాలి( 22 ),డేరంగుల శ్రీనివాసరావు (45) లు అక్కడికక్కడే మృతి చెందారు.. వారి శరీర భాగాలు కాలిపోయాయి... కొన ఊపిరితో ఉన్న చిలకలూరిపేట పట్టణం పోలిరెడ్డి పాలెం కు చెందిన నోచిన శేఖర్( 48) ను చిలకలూరిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా చనిపోయాడు... అతని కాళ్ళు కూడా కాలిపోయాయి.. చిన్న అజాగ్రత్త ముగ్గురు ప్రాణాలను బలి తీసుకుంది ..ఈ సంఘటన చిలకలూరిపేట ప్రాంతంలో అంతులేని విషాదాన్ని మిగిల్చింది ...మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు సంఘటన స్థలాన్ని పరిశీలించి బాధిత కుటుంబాలను ఓదార్చారు... కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు... చిలకలూరిపేట ఎమ్మెల్యే విడుదల రజిని ఆస్పత్రిలో మృతదేహాన్ని సందర్శించి నివాళులు అర్పించారు... చిలకలూరిపేట గ్రామీణ సి ఐ సుబ్బారావు ఆధ్వర్యంలో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు..

బైట్ 1: ఏం సుబ్బారావు చిలకలూరిపేట గ్రామీణ సి ఐ

Conclusion:మల్లికార్జున రావు ఈటీవీ భారత్ చిలకలూరిపేట గుంటూరు జిల్లా ఫోన్ నెంబర్ 8 0 0 8 8 8 3 2 1 7
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.