హైదరాబాద్ గచ్చిబౌలిలో నరసాపురం ఎంపి రఘురామకృష్ణరాజు ఇంటివద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న ఏపీ ఇంటిలిజెన్స్ కానిస్టేబుల్‌ను పట్టుకుని భద్రతా సిబ్బంది తెలంగాణ పోలీసులకు అప్పగించారు. ఇంటిలోకి చొరబడేందుకు యత్నించిన ఆగంతకుడిని పట్టుకున్న భద్రతా సిబ్బంది....ఎవరని ఎన్నిసార్లు ప్రశ్నించినా నోరుమెదపలేదు. అనంతరం గచ్చిబౌలి పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకుని వివరాలు సేకరించారు. తాను ఏపీ ఇంటిలిజెన్స్ కానిస్టేబుల్ సుభానిగా తెలిపాడు.అలియాస్ ఫరూక్ అని, రెండు రోజుల క్రితం ఇన్నోవాలో ఆరుగురు పోలీసులం హైదరాబాద్‌కు వచ్చామని చెప్పాడు
ఎంపీని అనుసరిస్తూ... కదలికలను గమనిస్తూ..
శనివారం ఉదయమే 10-12 మంది వ్యక్తులు రెండు కార్లలో హైదరాబాద్ చేరుకున్నారు. వీరిలో ఆరుగురు ఇన్నోవాలో గచ్చిబౌలిలోని ఎంపీ రఘురామ ఇంటి వద్ద కాపు గాసినట్టు సమాచారం. ఆయన వాహనాన్ని అనుసరిస్తూ... కదలికలను గమనిస్తూ వచ్చారు. ఏపీ పోలీసులు తనను వెంబడిస్తున్నారనే అనుమానంతో ఆదివారం రాత్రి నర్సాపూర్ ఎక్స్‌ప్రెస్‌లో భీమవరం బయల్దేరిన ఎంపీ రఘురామ ప్రధాని సభకు వెళ్లకుండానే బేగంపేట రైల్వేస్టేషన్‌లో దిగిపోయిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో సోమవారం ఉదయం ఎంపీ రఘురామ నివాసంలోకి ఒకరు ప్రవేశించి సెల్‌ఫోన్‌తో చిత్రీకరించే ప్రయత్నించారు. ఇది గుర్తించిన ఎంపీ అనుచరులు అప్రమత్తమయ్యారు. దేహశుద్ధి చేసి అతడిని పోలీసులకు అప్పగించారు. పట్టుబడిన వ్యక్తి సుభాని అని, అతడి ఫోన్‌కు ఆంజనేయులు అనే వ్యక్తి నుంచి ఫోన్‌కాల్స్ వచ్చాయని పోలీసులు గుర్తించారు. అనుమానాస్పద వ్యక్తిని గమనించామని, వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చామని ఎంపీ రఘురామ పీఏ శాస్త్రి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. మరో వైపు విధి నిర్వహణలో భాగంగా తాను బౌల్డర్‌హిల్స్ వద్ద ఉండగా నలుగురు వ్యక్తులు వచ్చి తనను కారులో ఎక్కించుకొని ఇంట్లోకి తీసుకెళ్లారని, చిత్రహింసలకు గురి చేశారని ఏపీ ఇంటెలిజెన్స్ కానిస్టేబుల్ ఎస్‌కే ఫరూక్ భాషా పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన వద్ద పర్సు, ఐడీ కార్డు లాగేసుకున్నారని పేర్కొన్నారు. ఇరువైపులా వచ్చిన ఫిర్యాదులు తీసుకొని విచారణ చేపట్టామని గచ్చిబౌలి ఇన్‌స్పెక్టర్ సురేష్ వెల్లడించారు.
ఇదీ చదవండి: ఆశ్చర్యం.. అలా ఎలా జరిగిందో అర్థంకావట్లేదు: ఎంపీ రఘురామ
కలెక్షన్స్‌లో 'విక్రమ్' సరికొత్త మైలురాయి.. ఇక కమల్ అప్పులన్నీ తీరినట్టే!
'నేను డిక్టేటర్‌గా మారతా.. వారి సంగతి చూస్తా'.. సీఎం స్ట్రాంగ్ వార్నింగ్!