హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల్లో పబ్‌ల నిర్వాహకులు నిబంధనలు బేఖాతరు చేస్తున్నారు. 18 ఏళ్లలోపు వారిని పబ్‌లలోకి అనుమతించకూడదనే నిబంధనలను ఉల్లంఘిస్తున్నారు.
గచ్చిబౌలిలోని వాల్‌స్ట్రీట్ పబ్‌లోకి చిన్నారిని అనుమతించడం కలకలం రేపింది. కుటుంబ సభ్యులతో కలిసి చిన్నారి పబ్‌లోకి వచ్చింది. ఈ దృశ్యాలను కొందరు సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు. ఈ ఘటనపై పోలీసు ఉన్నతాధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పబ్‌లోని సీసీ కెమెరాల దృశ్యాలను పరిశీలిస్తున్నారు. చిన్నారిని అసలు ఎవరు పబ్‌లోకి తీసుకువచ్చారనే విషయంపై ఆరా తీస్తున్నారు. పబ్ యాజమాన్యానికి నోటీసులు జారీ చేశారు. ఈ విధంగా నిబంధనలు పట్టించుకోకుండా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని పోలీసు ఉన్నతాధికారులు హెచ్చరించారు.
ఇదీ చదవండి: