ETV Bharat / city

అమెరికాలో రోడ్డు ప్రమాదం... ముగ్గురు హైదరాబాద్​ వాసులు మృతి - అమెరికాలో హైదరాబాద్​ దంపతుల మృతి

హైదరాబాద్​ నుంచి వెళ్లి అమెరికాలో స్థిరపడ్డారు. ఇప్పుడే ఓ కొత్త ఇంటిని నిర్మించుకుంటున్నారు. సంతోషంగా సాగిపోతున్న వారి జీవితం ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ఆ ఇంటిని చూసేందుకు బయలుదేరిన దంపతులు రోడ్డు ప్రమాదంలో అనంత లోకాలకు వెళ్లిపోయారు. వారితో కలిసి వెళ్తోన్న స్నేహితుడూ మరణించాడు. అమెరికాలోని డల్లాస్​లో జరిగిన ఘటనలో ముగ్గురు భాగ్యనగర వాసులు మృతి చెందారు.

అమెరికాలో రోడ్డు ప్రమాదం... ముగ్గురు హైదరాబాద్​ వాసులు మృతి

author img

By

Published : Feb 25, 2020, 11:36 PM IST

అమెరికాలో రోడ్డు ప్రమాదం... ముగ్గురు హైదరాబాద్​ వాసులు మృతి

అమెరికాలోని డల్లాస్​లో ఓ కారు వేగంగా వచ్చి మరో కారును ఢీకొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందారు. హైదరాబాద్​కు చెందిన రాజా, దివ్య దంపతులు అమెరికాలో స్థిర పడ్డారు. అక్కడే ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారు. వారి అన్యోన్యతకు గుర్తుగా ఏడేళ్ల కూతురు ఉంది. సంతోషంగా సాగిపోతున్న జీవితంలో సొంతింటి కల అలానే మిగిలిపోయిందనే బాధ ఉండేది. అందుకే ఇటీవలే ఓ ఇంటిని నిర్మించుకున్నారు.

కొత్త ఇంటిని చూసేందుకు దంపతులిద్దరూ బయలుదేరారు. రాజా మిత్రుడు ప్రేమ్​నాథ్​ను సైతం తీసుకెళ్లారు. వాళ్ల గారాల పట్టి రియాను డాన్స్ స్కూల్​లో దింపేశారు. మళ్లీ వస్తామని చెప్పారు. కొద్దిసేపటికే ఎదురుగా ఓ బాలుడు వేగంగా వచ్చి వారి కారును ఢీకొట్టాడు. ఈ ఘటనలో ముగ్గురూ అక్కడికక్కడే మృతి చెందారు.

దంపతులిద్దరిదీ హైదరాబాద్​లోని గాంధీనగర్​. ప్రేమ్​నాథ్​ది ఆంధ్రప్రదేశ్. రాజా బంధువు రాఘవరావు విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలియజేశారు. ఒకేసారి అమ్మానాన్న చనిపోవడం వల్ల ఏడేళ్ల చిన్నారి అనాథగా మారింది.

ఇదీ చూడండి:

పశ్చిమగోదావరి జిల్లాలో రోడ్డు ప్రమాదం... మహిళ మృతి, 20 మందికి గాయాలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.