ఫిలిప్పీన్స్ నుంచి వస్తూ కౌలాలంపూర్‌లో 200 మంది భారతీయులు చిక్కుకున్నారు. వీరిలో వందమందికి పైగా తెలుగు విద్యార్థులున్నట్లు తెలిసింది. కరోనా దృష్ట్యా కౌలాలంపూర్ విమానాశ్రయంలో అక్కడి అధికారులు నిలిపివేశారు. వీరిలో విశాఖ, తూర్పుగోదావరి, నెల్లూరు జిల్లాలకు చెందిన పలువురు విద్యార్థులు ఉన్నట్లు సమాచారం.
సీఎం జగన్ ఆరా...
మలేషియా సహా వివిధ దేశాల్లో చిక్కుకున్న తెలుగువారిపై సీఎం జగన్ ఆరా తీశారు. రాష్ట్రానికి రప్పించేలా చర్యలు తీసుకోవాలని సీఎంవో అధికారులను ఆదేశించారు. ఈ మేరకు ఏపీ భవన్, విదేశాంగ అధికారులతో సమన్వయం చేస్తున్నారు.
ఇదీ చదవండి : స్థానిక ఎన్నికల వాయిదాపై రేపు సుప్రీంలో విచారణ