తెలంగాణలోని సూర్యాపేట జిల్లా ఆత్మకూరు(ఎస్)లో తెలంగాణ భాజపా అధ్యక్షుడు బండి సంజయ్ పర్యటన సందర్భంగా (High Tension at Bandi Sanjay Tour) ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఆత్మకూరు(ఎస్)లో భాజపా, తెరాస శ్రేణులు మోహరించారు. ఒకరిపై ఒకరు దూసుకెళ్లేందుకు ఇరువర్గాల యత్నించారు. అప్రమత్తమైన పోలీస్ బలగాలు.. భాజపా, తెరాస కార్యకర్తలను చెదరగొట్టాయి. ఆత్మకూరు(ఎస్) ఐకేపీ కేంద్రం వద్ద ఉద్రిక్తత తీవ్రరూపం దాల్చింది. భాజపా, తెరాస కార్యకర్తల పోటాపోటీ నినాదాలు చేశాయి. బండి సంజయ్ గోబ్యాక్ అంటూ తెరాస కార్యకర్తల నినాదాలు చేశారు. బండి సంజయ్‌ను అడ్డుకునేందుకు తరలివచ్చిన తెరాస శ్రేణులు.. నల్లజెండాలు ప్రదర్శిస్తూ నిరసన (High Tension at Bandi Sanjay Tour) తెలిపాయి. నిరసనలో జడ్పీ వైస్ ఛైర్మన్ వెంకట నారాయణగౌడ్ పాల్గొన్నారు.
అంతకు ముందు..
అంతకు ముందు సూర్యాపేట జిల్లా చివ్వెంలలో ఉద్రిక్తత పరిస్థితుల నడుమ భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్(Bandi sanjay news) పర్యటన ముగిసింది. బండి సంజయ్‌ను అడ్డుకునేందుకు చివ్వెంలకు తెరాస శ్రేణులు మంగళవారం ఉదయం భారీగా తరలివచ్చారు. బండి సంజయ్ గోబ్యాక్ అంటూ నినాదాలు చేశారు. ఈ క్రమంలో తెరాస వర్గీయులకు పోటీగా భాజపా శ్రేణులు నినాదాలు చేసుకున్నారు. భాజపా, తెరాస(bjp vs trs news) కార్యకర్తలు పరస్పరం రాళ్లు రువ్వుకున్నారు. రాళ్ల దాడిలో కానిస్టేబుల్‌కు గాయాలయ్యాయి. భాజపా, తెరాస వర్గాలను అదుపుచేసేందుకు పోలీసుల ముమ్మరంగా యత్నించారు. ఈ గందరగోళం మధ్యే బండి సంజయ్.. (Bandi sanjay suryapet visit) ఆత్మకూర్(ఎస్) బయల్దేరారు.
అర్వపల్లిలో ఉద్రిక్తత
ఉమ్మడి నల్గొండ జిల్లాలో బండి సంజయ్ పర్యటన(Bandi sanjay visit news) దృష్ట్యా యాదాద్రి భువనగిరి జిల్లా అర్వపల్లి సెంటర్‌లో ఉద్రిక్తత నెలకొంది. భాజపా శ్రేణులపై తెరాస(bjp vs trs news) కార్యకర్తలు రాళ్లు రువ్వారు. తమ నాయకుడికి స్వాగతం పలికేందుకు భాజపా శ్రేణులు భారీగా తరలివచ్చారు. సంజయ్ పర్యటనలో నిరసన తెలిపేందుకు తెరాస కార్యకర్తలు పెద్దసంఖ్యలో వచ్చారు.
అమిత్‌షా ఫోన్
ఉమ్మడి నల్గొండ జిల్లాలో పర్యటిస్తున్న బండి సంజయ్‌కు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా, జేపీ నడ్డా, భాజపా రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి తరుణ్ చుగ్ ఫోన్ చేశారు. నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో బండి సంజయ్‌పై జరిగిన దాడి వివరాలను అడిగి తెలుసుకున్నారు. వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించేందుకు వెళ్తే తెరాస నేతలు దాడికి పాల్పడ్డారని బండి సంజయ్ వారికి తెలియజేశారు. దాడికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని తరుణ్ చుగ్కి వివరించారు.
ఏం జరిగింది?
ధాన్యం కొనుగోళ్ల పరిశీలన కోసం బండి సంజయ్ చేపట్టిన యాత్ర(bandi sanjay nalgonda tour) సోమవారం రణరంగంగా మారింది. నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో... తెరాస, భాజపా శ్రేణుల మధ్య ఘర్షణ(trs vs bjp) ఏర్పడింది. మిర్యాలగూడ రాళ్ల దాడిలో పలువురికి గాయాలు కాగా... నేరేడుచర్లలో వాహనాల అద్దాలు ధ్వంసమయ్యాయి. సంజయ్ రాక(bandi sanjay latest news) పట్ల నిరసన తెలియజేస్తామని ముందుగానే ప్రకటించిన తెరాస శ్రేణులు(trs vs bjp) అడుగడుగునా ఆయన్ను అడ్డుకున్నాయి. పరస్పర నినాదాలు, కోడిగుడ్లు, రాళ్లు రువ్వుకోవడంతో పరిస్థితి విధ్వంసకరంగా మారింది. మిర్యాలగూడ, శెట్టిపాలెం, చిల్లేపల్లి వంతెన, నేరేడుచర్ల, గరిడేపల్లి, గడ్డిపల్లి ఇలా ప్రతి చోటా భారీగా తెరాస శ్రేణులు.. బండి కాన్వాయ్‌ను అడ్డుకుంటూ ఆందోళనలు చేశారు. సోమవారం రాత్రి బండి సంజయ్ సూర్యాపేట చేరుకునే వరకూ నిరసనలు ఆగలేదు. పెన్ పహాడ్ మండలం అనంతారం, అనాజ్ పూర్ మీదుగా సూర్యాపేట వెళ్తుండగా... అడుగడుగునా తెరాస కార్యకర్తలు అడ్డుకున్నారు. ఇవాళ కూడా ఇదే పరిస్థితి కనిపించింది.
ఇదీచూడండి:
స్థానిక సంస్థల కోటాలో 11 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికల నోటిఫికేషన్ జారీ