ఇదీ చదవండీ... రాష్ట్రాభివృద్ధికి ఏఐఐబీ దన్ను..!
'జగన్ కూడా ఈ నిర్ణయం తీసుకుంటారేమో వేచిచూద్దాం' - high court comments on jagan
ప్రభుత్వ భవనాలకు వైకాపా రంగులు వేస్తున్న నేపథ్యంలో... వీటి నిర్వహణ విషయమై కేంద్ర వైఖరి తెలుసుకోవాలని హైకోర్టు నిర్ణయించింది. సుప్రీం కోర్టు మార్గదర్శకాలు, నేషనల్ బిల్డింగ్ కోడ్ వివరాలను అధ్యయనం చేయాలని సహాయ సొలిసిటర్ జనరల్ కృష్ణమోహన్‌కు సూచించింది. స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాల్సిన తరుణంలో... ప్రభుత్వ కార్యాలయాలపై ముఖ్యమంత్రి బొమ్మ ఉంచడం సరికాదని హైకోర్టు పునరుద్ఘాటించింది. ఆర్టీసీ కార్గో రవాణా బస్సులపై తన చిత్రం ఉంచొద్దని తెలంగాణ సీఎం కోరినట్లు పత్రికల్లో చూశామని గుర్తుచేసింది. అదే తరహాలో ఏపీ సీఎం జగన్ కూడా నిర్ణయం తీసుకుంటారేమో వేచిచూద్దామని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఏజీ వాదనల కోసం విచారణను ఈ నెల 11కు వాయిదా వేసింది.
'జగన్ కూడా ఈ నిర్ణయం తీసుకుంటారేమో వేచిచూద్దాం'
ఇదీ చదవండీ... రాష్ట్రాభివృద్ధికి ఏఐఐబీ దన్ను..!