జగ్గయ్యపేట ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ సామినేని ఉదయభానుపై ఉన్న 10 క్రిమినల్ కేసులు ఉపసంహరించుకోవడంపై దాఖలైన వ్యాజ్యంపై హైకోర్టు విచారణ(high court on wip Samineni Udayabhanu case) చేపట్టింది. ఒకే జీవోతో 10 కేసులు ఎలా ఉపసంహరిస్తారంటూ ధర్మాసనం ప్రశ్నించింది. పబ్లిక్ ప్రాసిక్యూటర్ స్వచ్ఛందంగా తీసుకోవాల్సిన నిర్ణయంలో డీజీపీ పాత్ర ఏంటని న్యాయస్థానం నిలదీసింది. కేసులు ఉపసంహరించుకోవడంపై కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.
ఉదయభానుపై ఉన్న 10 క్రిమినల్ కేసులు ఉపసంహరించుకోడంపై ఆంధ్రప్రదేశ్ జర్నలిస్టుల ఫోరం అధ్యక్షులు చెవుల కృష్ణాంజనేయులు కోర్టులో పిల్ దాఖలు చేశారు. కొన్ని కేసుల్లో నిబంధనలకు విరుద్దంగా అధికార పార్టీ ఎమ్మెల్యే అని కేసులు ఉపసంహరించారని పిటిషనర్ తరఫు న్యాయవాది జడ శ్రావణ్ కుమార్ వాదించారు. 10 కేసుల ఉపసంహరణపై ప్రభుత్వం ఇచ్చిన జీవోలను కొట్టివేయాలని న్యాయవాది కోరారు. న్యాయవాది శ్రవణ్ కుమార్ వాదనతో ఏకీభవించిన ధర్మాసనం.. ఉదయభానుకు నోటీసులు జారీ(hc notices to wip samineni Udayabhanu on withdrawal of criminal cases) చేసింది. కౌంటర్ దాఖలు చేయాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించిన న్యాయస్థానం.. విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది.