ETV Bharat / city

ఫోన్ ట్యాపింగ్​ తేలిగ్గా తీసుకోం.. జోక్ అనుకుంటున్నారా?: హైకోర్టు - ఏపీ ఫోన్ ట్యాపింగ్ న్యూస్

హైకోర్టు న్యాయమూర్తుల ఫోన్ ట్యాపింగ్ తీవ్రమైన విషయమని హైకోర్టు వ్యాఖ్యానించింది. తేలిగ్గా తీసుకునే వ్యవహారం కాదని పేర్కొంది. దర్యాప్తు జరపాల్సిన అవసరం ఉందని ధర్మాసనం.. అభిప్రాయం వ్యక్తం చేసింది.

high court on phone tapping
high court on phone tapping
author img

By

Published : Aug 19, 2020, 5:26 AM IST

ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై దాఖలైన పిటిషన్​ను హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జేకే మహేశ్వరి, జస్టిస్ డి.రమేశ్​తో కూడిన ధర్మాసనం విచారణ చేసింది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని పర్యవేక్షించేందుకు ఓ ఐపీఎస్ అధికారిని నియమించారని, జడ్జిల కదలికలను దగ్గరగా పరిశీలించేందుకు ఒక్కో న్యాయమూర్తికి ఐదు, ఆరు మందిని ఏర్పాటు చేసినట్లు తనకు విశ్వసనీయ సమాచారం ఉందని పిటిషనర్ తరఫు న్యాయవాది జడ శ్రావణ్ కుమార్ కోర్టు దృష్టికి తెచ్చారు. ఆ వివరాలతో అదనపు అఫిడవిట్ దాఖలు చేస్తామన్నారు. అందుకు అంగీకరించిన హైకోర్టు విచారణను ఈనెల 20కి వాయిదా వేసింది.

ఏపీ హైకోర్టుకు చెందిన కొంత మంది న్యాయమూర్తుల ఫోన్లను ట్యాపింగ్ చేస్తున్నారని ఈ వ్యవహారంపై సీబీఐ నేతృత్వంలోని సిట్​తో దర్యాప్తు జరిపించాలని కోరుతూ విశాఖ జిల్లా గోపాలపట్నానికి చెందిన న్యాయవాది ఎ.నిమ్మీగ్రేస్ హైకోర్టులో పిల్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. రాజకీయ ప్రోద్బలంతో ఫోన్ ట్యాపింగ్​కు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, హోంశాఖ ముఖ్య కార్యదర్శి, డీజీపీ యత్నించారన్న ఆరోపణలపై వాస్తవాలను తేల్చాలని కోరారు. ఈ వ్యవహారంపై ఓ పత్రిక ప్రచురించిన కథనాన్ని కోర్టుకు సమర్పించారు.

ఈ వ్యాజ్యంపై మంగళవారం జరిగిన విచారణలో పిటిషనర్ తరపు న్యాయవాది శ్రావణ్ కుమార్ వాదనలు వినిపిస్తూ .. ' ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడటం చట్ట విరుద్ధం. ఈ వ్యవహారంలో సుప్రీంకోర్టు స్పష్టమైన మార్గదర్శకాలు జారీచేసింది. ట్యాపింగ్ కు పాల్పడటం గోప్యత హక్కును హరించడమే. దర్యాప్తునకు ఆదేశించండి ' అని అభ్యర్థించారు. పత్రిక కథనం ఆధారంగా దర్యాప్తు ఎలా సాధ్యమన్న ధర్మాసనం ప్రశ్నకు బదులిస్తూ.. 'ప్రాథమిక హక్కులు ఉల్లంఘన జరిగినప్పుడు వాటిని రక్షించాల్సిన బాధ్యత కోర్టులపై ఉందని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. ఇటీవల హైకోర్టు ఇచ్చిన తీర్పులపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ పలువురు సామాజిక మాధ్యమాల్లో పెట్టిన పోస్టులను హైకోర్టు సుమోటోగా తీసుకుంది. అప్పటి ఏపీ హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ సీఐడీకి ఫిర్యాదు చేశారు. దేశ చరిత్రలో ఆర్ జీ ఫిర్యాదు చేసిన సందర్భాలు లేవు. హైకోర్టు జడ్జిలకు, న్యాయస్థానానికి కళంకం తేవాలన్న ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం, మద్దతుదార్లు పలుయత్నాలు చేశారు'.. అని వివరించారు.

  • ప్రభుత్వమే చేసిందంటారా?: ధర్మాసనం

ఆ వివరాల్ని పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం .. మీ ఆరోపణల ప్రకారం ప్రభుత్వమే ట్యాపింగ్ చేసిందంటారా? అని న్యాయవాదిని ప్రశ్నించింది. ఔను అని ఆయన బదులిచ్చారు. రాజకీయ పెద్దల ప్రోద్బలంతో న్యాయమూర్తుల ఫోన్లు ట్యాపింగ్ చేశారు. ఆ విషయాన్ని అఫిడవిట్లో పేర్కొన్నాను. ట్యాపింగ్ వ్యవహారం మొత్తాని ఓ ఐపీఎస్ అధికారి పర్యవేక్షించారు.' అని కోర్టుకు తెలిపారు.

  • తప్పుడు కథనాన్ని ప్రచురించారు : ఏఏజీ

సీఎస్ తరఫున అదనపు అడ్వొకేట్ జనరల్ (ఏఏజీ ) పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపిస్తూ... 'ఫోన్లు ట్యాపింగ్ చేశారని తప్పుడు కథనాన్ని పత్రికలో ప్రచురించారు. పత్రిక యాజమాన్యానికి నోటీసులు జారీచేశాం. ఆ కథనం ఆధారంగా పిల్ ఎలా దాఖలు చేస్తారు? పత్రిక యాజమాన్యాన్ని వ్యాజ్యంలో ప్రతివాదిగా చేర్చి వార్త ప్రచురణకు ఆధారం ఏమిటో వివరాలు అఫిడవిట్ వేసేలా ఆదేశాలు జారీచేయాలి'. అని కోర్టును కోరారు. ధర్మాసనం స్పందిస్తూ .. ప్రస్తుతం ఆ మేరకు ఆదేశాలు జారీచేయలేం. పత్రికకు ఇప్పటికే మీరు నోటీసులు ఇచ్చామని చెబుతున్న నేపథ్యంలో తదుపరి చర్యలు మీరే తీసుకోవచ్చు. ట్యాపింగ్ విషయం తీవ్రమైనది.. దాన్ని తేలిగ్గా తీసుకోవడానికి వీల్లేదు. దర్యాప్తు జరగాల్సిందే.' అని స్పష్టం చేసింది. తీవ్రమైన విషయం కాబట్టే సంబంధిత మీడియాను ప్రతివాదిగా చేర్చి నోటీసు ఇవ్వాలని కోరుతున్నట్లు అదనపు ఏజీ తెలిపారు. సంబంధిత పత్రికకు వ్యతిరేకంగా పిటిషనర్ ఎలాంటి అభ్యర్థన చేయనప్పుడు ఎందుకు నోటీసు జారీచేయాలని ధర్మాసనం ప్రశ్నించింది. వార్త ప్రచురణకు మూలాధారం ఏమిటో తగిన సమయంలో పరిశీలిస్తామని తెలిపింది. పిటిషనర్ అదనపు అఫిడవిట్ వేస్తే అన్ని వివరాలు బయటకొస్తాయని పేర్కొంది.

  • న్యాయమూర్తుల ఫోన్ల ట్యాపింగ్ జోక్ అనుకుంటున్నారా?

రాష్ట్ర హోంశాఖ ముఖ్య కార్యదర్శి , డీజీపీ తరఫున.. ప్రభుత్వ న్యాయవాది(జీపీ) సుమన్ వాదనలు వినిపిస్తూ .. పిటిషనర్ దాఖలు చేసిన అఫిడవిట్ ను పరిశీలిస్తే ఈ విషయాన్ని తేలిగ్గా తీసుకున్నట్లు అర్థమవుతోందన్నారు. ఇలాంటి తీవ్రమైన విషయంపై అన్ని వివరాలు లేకుండా.. పిటిషనర్​ కోర్టును ఆశ్రయించడానికి ఇదేమీ..జోక్ కాదన్నారు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ .. న్యాయమూర్తుల ఫోన్లు ట్యాపింగ్ చేయడం జోక్ అనుకుంటున్నారా? అని ప్రశ్నించింది. పిటిషనర్ అదనపు వివరాలతో అఫిడవిట్ దాఖలు చేస్తే మీకు వచ్చిన సమస్య ఏంటని వ్యాఖ్యానించింది. జీపీ బదులిస్తూ.. 'మాకు అభ్యంతరం లేదు. పత్రికలో కథనం పరిశీలిస్తే కొంతమంది న్యాయమూర్తులు మీడియాతో మాట్లాడినట్లు ఉంది. ఏ న్యాయమూర్తి మీడియా హౌజ్ కు వెళ్లి మాట్లాడినట్లు మేము అనుకోవడం లేదు. పరిపాలనా పరంగా ప్రభుత్వం ఈ వ్యవహారంపై హైకోర్టుకు వివరాలు పంపింది. సంబంధిత పత్రికకు నోటీసు ఇచ్చాం. అవసరమైన చర్యలు తీసుకుంటున్నాం. వ్యాజ్యంలో పత్రికను ప్రతివాదిగా చేర్చాలి' అని కోరారు.

ఇదీ చదవండి: కడప జైలులో కరోనా పంజా..303 మంది ఖైదీలకు పాజిటివ్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.