ETV Bharat / city

high court : లీగల్‌ ఫీజుల చెల్లింపులో జాప్యంపై హైకోర్టు ఆక్షేపణ

న్యాయసేవలు అందించినందుకు లా ఆఫీసర్లకు ప్రభుత్వ, ప్రభుత్వ రంగ సంస్థలు సకాలంలో ఫీజులు చెల్లించకపోవటాన్ని హైకోర్టు తప్పుపట్టింది.రాజకీయ కారణాలతో లీగల్‌ ఫీజుల చెల్లింపుల్లో జాప్యం చేయడం సరికాదంది. సకాలంలో బిల్లులు చెల్లించకపోవడం చట్టవిరుద్ధం, అధికరణ 21ను ఉల్లంఘించడమేనని తేల్చిచెప్పింది.

హైకోర్టు
హైకోర్టు
author img

By

Published : Mar 18, 2022, 4:35 AM IST

న్యాయసేవలు అందించినందుకు లా ఆఫీసర్లు (ప్రభుత్వ న్యాయవాదులు- జీపీ, ఏజీపీ), స్టాండింగ్‌ కౌన్సిళ్లకు ప్రభుత్వ, ప్రభుత్వ రంగ సంస్థలు, వివిధ కార్పొరేషన్లు సకాలంలో ఫీజులు చెల్లించకపోవడాన్ని హైకోర్టు తప్పుపట్టింది. ఇది వారి చట్టబద్ధమైన హక్కులను హరించడమే కాదు హుందాగా జీవించే హక్కును కాలరాయడమేనని వ్యాఖ్యానించింది. గత ప్రభుత్వ హయాంలో పని చేసినందునే తమకు ఫీజు చెల్లించడం లేదన్న పిటిషనర్‌ ఆరోపణ నిజమైతే ఆ చర్య దురదృష్టకరమని, అలాంటి వాటిని అంగీకరించబోమని పేర్కొంది. రాజకీయ కారణాలతో లీగల్‌ ఫీజుల చెల్లింపుల్లో జాప్యం చేయడం సరికాదంది. సకాలంలో బిల్లులు చెల్లించకపోవడం చట్టవిరుద్ధం, అధికరణ 21ను ఉల్లంఘించడమేనని తేల్చిచెప్పింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ బట్టు దేవానంద్‌ ఇటీవల ఓ వ్యాజ్యంలో ఈ మేరకు తీర్పు ఇచ్చారు.

ఇవీ హైకోర్టు ఆదేశాలు

* ప్రభుత్వ, ప్రభుత్వరంగ సంస్థలు జీపీ, ఏజీపీ, స్టాండింగ్‌ కౌన్సిళ్ల పెండింగ్‌ బిల్లులను నాలుగు వారాల్లో చెల్లించాలి. విఫలమైతే 12% వడ్డీతో చెల్లించాలి.

* ఇకపై వృత్తిపరమైన రుసుము/గౌరవ వేతనం/రిటైనర్‌ రుసుములను బిల్లులు సమర్పించినప్పటి నుంచి నాలుగు వారాల్లో చెల్లించాలి. విఫలమైతే 12 శాతం వడ్డీతో కట్టాలి.

* జిల్లా కోర్టులు, సీనియర్‌ సివిల్‌ జడ్జి, జూనియర్‌ సివిల్‌ జడ్జి కోర్టులు, ట్రైబ్యునళ్లలో పనిచేస్తున్న లా ఆఫీసర్లు, స్టాండింగ్‌ కౌన్సిళ్లకు లీగల్‌ రుసుము, గౌరవ వేతనాన్ని ప్రతి నెలా చెల్లించేలా రాష్ట్ర న్యాయశాఖ కార్యదర్శి చర్యలు తీసుకోవాలి. ఇప్పుడున్న పెండింగ్‌ బిల్లులన్నీ నాలుగు వారాల్లో చెల్లించాలి.

* సకాలంలో బిల్లులు చెల్లించేలా సంబంధిత అధికారులకు ఆదేశాలిచ్చేందుకు.. ఈ తీర్పు ప్రతిని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్‌)కు పంపాలి.

కోర్టును ఆశ్రయించే పరిస్థితి తేవద్దు

రాయలసీమ ప్రాంత మండల పరిషత్‌, జిల్లా పరిషత్‌, గ్రామ పంచాయతీలకు స్టాండింగ్‌ కౌన్సిల్‌గా పనిచేసిన సీహెచ్‌ వేదవాణి.. తనకు లీగల్‌ రుసుములు చెల్లించకపోవడంపై 2015 ఏప్రిల్‌ 15న హైకోర్టులో పిటిషన్‌ వేశారు. బిల్లులు చెల్లించాలని కోర్టు అధికారులను ఆదేశించింది. చెల్లించకపోవడంతో 2016లో ఆమె కోర్టు ధిక్కరణ వ్యాజ్యం వేశారు. ఈ వ్యవహారంపై ఇటీవల విచారణ సందర్భంగా లీగల్‌ రుసుములు సకాలంలో చెల్లించక ప్రభుత్వ న్యాయవాదులు, స్టాండింగ్‌ కౌన్సిళ్లు ఇబ్బందులు పడుతున్న విషయం న్యాయమూర్తి దృష్టికి వచ్చింది. న్యాయమూర్తి విచక్షణాధికారాన్ని ఉపయోగించి వ్యాజ్యం విచారణ పరిధిని విస్తృతపరిచి, ప్రభుత్వానికి ఆదేశాలిచ్చారు. వేదవాణికి బిల్లుల చెల్లింపులో జరిగిన జాప్యానికి అధికారులు క్షమాపణలు కోరడంతో కోర్టు ధిక్కరణ వ్యాజ్యంపై విచారణను మూసివేశారు. ప్రభుత్వ న్యాయవాదులు, స్టాండింగ్‌ కౌన్సిళ్లు రుసుముల కోసం హైకోర్టును ఆశ్రయించడం, కోర్టుధిక్కార వ్యాజ్యాలు వేసే పరిస్థితి తీసుకురావద్దని న్యాయమూర్తి హితవు పలికారు.

ఇదీ చదవండి: హైకోర్టులో ప్రభుత్వానికి ఎదురుదెబ్బ... ఆరు వారాల్లో పీపీఏ బకాయిలు చెల్లించాలని ఆదేశం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.