ETV Bharat / city

ఐఆర్‌ఎస్‌ అధికారి జాస్తి కృష్ణకిశోర్‌పై కేసు కొట్టివేస్తూ హైకోర్టు ఉత్తర్వులు..

author img

By

Published : Jul 19, 2022, 12:16 PM IST

Updated : Jul 19, 2022, 1:51 PM IST

HIGH COURT: ఐఆర్‌ఎస్‌ అధికారి జాస్తి కృష్ణకిశోర్‌పై నమోదైన కేసును కొట్టివేస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఈడీబీ సీఈవోగా ఉన్నప్పుడు అవకతవకలకు పాల్పడ్డారని గతంలో సస్పెన్షన్‌ విధించగా.. దానిపై జాస్తి హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ కేసులన్నింటిని కొట్టేస్తూ హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది.

jasti
jasti

HIGH COURT: ఐఆర్‌ఎస్‌ అధికారి జాస్తి కృష్ణకిశోర్‌పై నమోదైన కేసును కొట్టివేస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. జాస్తి కృష్ణకిశోర్​పై గతంలో మంగళగిరి సీఐడీ పోలీసులు కేసు నమోదు చేయగా.. తాజాగా దానికి సంబంధించిన లిఖిత పూర్వక ఉత్తర్వులు బయటపడ్డాయి. ఈడీబీ సీఈవోగా ఉన్నప్పుడు అవకతవకలకు పాల్పడ్డారంటూ గతంలో కృష్ణకిషోర్​పై మంగళగిరి సీఐడీ పోలీసులు వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. దీనిపై కృష్ణకిషోర్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు.. కృష్ణకిషోర్ వ్యక్తిగతంగా నిర్ణయాలు తీసుకున్నట్లు గాని, లాభపడినట్లు గాని ఎక్కడా అధారాలు లేవని పేర్కొంది. అంతే కాకుండా సీఎం జగన్​పై కేసులను దర్యాప్తు చేసిన నాటి సీబీఐ అధికారి లక్ష్మీనారాయణతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయనే కారణంగా కేసు పెట్టినట్లు అభిప్రాయపడింది. భజన్​లాల్ కేసులో సుప్రీంకోర్టు నిర్దేశించిన మార్గదర్శకాలకు అనుగుణంగా ఈ కేసు కొట్టివేసినట్లు హైకోర్టు వ్యాఖ్యానించింది.

కృష్ణకిషోర్ హైదరాబాద్ ఆదాయపు పన్నుశాఖ సర్కిల్​లో పని చేసిన సమయంలో జగన్​కు చెందిన జగతి పబ్లికేషన్​పై వస్తున్న ఆదాయానికి పన్నులు కట్టమని నోటీసులు ఇచ్చారని.. దాన్ని మనసులో పెట్టుకుని కక్షసాధింపుగా అధికారంలోకి వచ్చిన తరువాత సస్పెండ్ చేసి.. తప్పుడు కేసు బనాయించినట్లు కృష్ణ కిషోర్ తన పిటిషన్​లో పేర్కొన్నారు.

ఇదీ జరిగింది: రాష్ట్ర ప్రభుత్వం సస్పెన్షన్ వేటు వేసిన రాష్ట్ర ఆర్థికాభివృద్ధి మండలి (ఏపీ ఈడీబీ) మాజీ సీఈఓ, ఐఆర్ఎస్ అధికారి కృష్ణ కిషోర్​పై సీఐడీ కేసు నమోదు చేసింది. ఈడీబీలో ఉండగా నిధులు దుర్వినియోగం చేయటంతో పాటు ప్రభుత్వ ముందస్తు అనుమతి లేకుండా కోట్లాది రూపాయల విలువైన ప్రకటనలు జారీ చేశారన్న అభియోగంపై సీఐడీ కేసు నమోదు చేసింది. ఈడీబీలోని ప్రత్యేక గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ తులసీ రాణి చేసిన ఫిర్యాదు మేరకు ఐపీసీ సెక్షన్లు 188, 120 బి, 409 ప్రకారం అభియోగాలు నమోదు చేశారు. ఏపీ ఈడీబీ- 2018 చట్టం ప్రకారం కూడా ఎఫ్ఐఆర్లో సీఐడీ అభియోగాలు మోపారు. ఈడీబీలోని మాజీ అకౌంట్స్ అధికారి బి. శ్రీనివాసరావుపై కూడా కేసులు నమోదయ్యాయి. ఈడీబీలో ఉద్యోగాలు, ప్రజాధనం దుర్వినియోగం చేశారంటూ కేసు చేశారన్న అభియోగాలను ఇరువురిపైనా సీఐడీ మోపింది.

ఇవీ చదవండి:

Last Updated : Jul 19, 2022, 1:51 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.