HC On Petition of PRC: ప్రభుత్వం ప్రకటించిన పీఆర్సీకి నిరసనగా ఉద్యోగులు సమ్మె చేసేందుకు ఇచ్చిన నోటీసులను సవాలు చేస్తూ దాఖలైన ప్రజాహిత వ్యాజ్యంపై విచారణను హైకోర్టు మూసివేసింది. పిటిషనర్ శ్రాంత ప్రొఫెసర్ సాంబశివరావు తరపు న్యాయవాది శరత్ కుమార్.. ఉద్యోగులు సమ్మెను విరమించారని.. తమ వ్యాజ్యం నిరర్ధకమని న్యాయస్థానానికి నివేదించారు.
ఆ వివరాలను పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం.. నిరర్థకమైన పిల్‌గా ప్రకటిస్తూ.. వాటిపై విచారణను మూసివేసింది.
ఇదీ చదవండి: