ETV Bharat / city

'పిల్లల పట్ల తల్లిదండ్రులు బాధ్యతగా వ్యవహరించాలి' - sai pallavi speech on she safe app

హైదరాబాద్‌ హెచ్‌ఐసీసీలో జరిగిన మహిళాసాధికారత సదస్సులో సినీ నటి సాయి పల్లవి పాల్గొన్నారు. 'షీ సేఫ్' యాప్​ను ఆమె ప్రారంభించారు. మహిళల కోసం తెలంగాణ పోలీసులు ఎంతో కృషి చేస్తున్నారని ప్రశంసించారు.

heroin-sai-pallavi-lunches-the-she-safe-app
'పిల్లల పట్ల తల్లిదండ్రులు బాధ్యతగా వ్యవహరించాలి'
author img

By

Published : Feb 20, 2020, 2:37 PM IST

హైదరాబాద్‌ హెచ్‌ఐసీసీలో మహిళా సాధికారత సదస్సులో సినీ నటి సాయి పల్లవి పాల్గొన్నారు. సైబరాబాద్ పోలీసులు, సొసైటీ ఫర్ సెక్యూరిటీ కౌన్సిల్ సంయుక్తాధ్వర్యంలో నిర్వహించిన 'షీ సేఫ్' ఆమె ప్రారంభించారు. పిల్లలకు చిన్నతనం నుంచి మంచి, చెడు ఏంటో నేర్పించాలని విజ్ఞప్తి చేశారు. తల్లిదండ్రులు తమ పిల్లల పట్ల బాధ్యతగా ఉండాలన్నారు. సమాజంలో ఇతరులకు ఇబ్బంది కల్గించకుండా నడుచుకోవడం కనీస బాధ్యతని గుర్తుచేశారు. అందరి భద్రత కోసం అనేక కార్యక్రమాలు చేపడుతున్న ఉన్నతాధికారులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

తెలంగాణ పోలీసులు ఎంతో కృషి చేస్తున్నారు..

మహిళల కోసం తెలంగాణ పోలీసులు ఎంతో కృషి చేస్తున్నారని ప్రశంసించారు. హైదరాబాద్​లో మహిళలకు ఉన్న భద్రత మరెక్కడా లేదని పేర్కొన్నారు. సిటీకి చదువు, ఉద్యోగాల కోసం వచ్చే మహిళలు యువతులు గతంలో చాలా భయపడే వారని, ప్రస్తుతం సిటీ పోలీసుల భద్రతతో నిశ్చింతగా మహిళలు ఉంటున్నారని తెలిపారు.

ఇవీ చూడండి: రోజాను అడ్డుకున్న రాజధాని రైతులు

హెచ్‌ఐసీసీలో జరిగిన మహిళాసాధికారత సదస్సులో పాల్గొన్న సినీ నటి సాయి పల్లవి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.