అమరావతి రైతుల ఆందోళనపై కథానాయకుడు నారా రోహిత్ ఫేస్బుక్ ద్వారా స్పందించారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణం కోసం భూములిచ్చిన రైతుల త్యాగం వెలకట్టలేనిదని కొనియాడారు. విభజనతో జీవచ్ఛవంలా మిగిలిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి.. ప్రాణ సమానమైన భూములు త్యాగం చేసి, అమరావతి రూపంలో ప్రాణం పోశారని కితాబునిచ్చారు. వారి ఔదార్యంతోనే అమరావతిలో పాలనకు బాటలు పడ్డాయని గుర్తు చేశారు. ఆ మార్గం చెదిరిపోకూడదని 23 రోజులుగా రైతులు చేస్తున్న పోరాటం.. భావితరాలకు స్ఫూర్తిదాయకమని తెలిపారు. రైతుల ఉద్యమానికి సంకెళ్లు పడుతున్నా, పోరాటం వృథా కాదన్నారు. త్వరలోనే రాతులతో కలిసి పోరాటంలో పాలు పంచుకుంటానని ఫేస్బుక్లో చెప్పారు.
ఇదీ చదవండి: