ETV Bharat / city

"రాష్ట్రంలో భారీ వర్షాలు.. అత్యవసరమైతే ఈ నంబర్లకు ఫోన్ చేయండి"

Rains: దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లోనూ నైరుతీ రుతుపవనాలు అత్యంత క్రియాశీలకంగా మారినట్టు భారత వాతావరణ విభాగం వెల్లడించింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతం నుంచి ఒడిశా - కోస్తాంధ్ర తీరం వరకూ ఉపరితల ద్రోణి కొనసాగుతున్నట్టు ఐఎండీ తెలిపింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణా, ఒడిశా, కేరళ, కర్ణాటక రాష్ట్రాల్లో చాలా చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే సూచనలు ఉన్నట్టు పేర్కొంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో అధికారులు అప్రమత్తమయ్యారు. అత్యవసర సహాయం కోసం కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేశారు.

rains
rains
author img

By

Published : Jul 9, 2022, 11:19 AM IST

Updated : Jul 9, 2022, 4:58 PM IST

Rains: నైరుతి రుతుపవనాల ప్రభావంతో.. దేశవ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయని భారత వాతావరణ విభాగం వెల్లడించింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతం నుంచి ఒడిశా - కోస్తాంధ్ర తీరం వరకూ ఉపరితల ద్రోణి కొనసాగుతున్నట్టు ఐఎండీ వెల్లడించింది. మరోవైపు రాజస్థాన్ లోని జైసల్మేర్ నుంచి పశ్చిమ మధ్య బంగాళాఖాతం వరకూ మరో ఉపరితల ద్రోణి కూడా కొనసాగుతోందని తెలిసింది.

వీటి ప్రభావంతో జమ్మూ కశ్మీర్, గుజరాత్, మధ్యప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నట్టు వివరించింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణా, ఒడిశా, కేరళ, కర్ణాటక రాష్ట్రాల్లో చాలా చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే సూచనలు ఉన్నట్టు తెలియచేసింది. తెలుగు రాష్ట్రాల్లో రెండు రోజులపాటు విస్తారంగా వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది.

ఈ నేపథ్యంలో రాష్ట్రంలో అధికారులు అప్రమత్తమయ్యారు. ఇవాళ, రేపు రాష్ట్రంలో అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే సూచన ఉండడంతో ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. వర్షాలు, వరదల దృష్ట్యా విపత్తుల సంస్థ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసింది. జిల్లాల వారీగా సైతం కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేయాలని యంత్రాంగానికి సూచించింది. భారీ వర్షాలు, వరదలు సంభవిస్తే.. కంట్రోల్ రూమ్‌కు తెలపాలని కోరింది. అత్యవసర సహాయం, సమాచారం కోసం కంట్రోల్ రూమ్‌ల ను సంప్రదించాలని, ఇందుకోసం 1070, 1800 425 0101, 08632377118 నంబర్లను సంప్రదించాలని సూచించింది. ఈ కంట్రోల్ రూమ్స్ 24 గంటలూ అందుబాటులో ఉంటాయని ప్రకటించింది.

ఇవీ చూడండి:

Last Updated : Jul 9, 2022, 4:58 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.