ETV Bharat / city

JURALA: జూరాల జలాశయానికి భారీగా చేరుతున్న వరదనీరు - తెలంగాణ తాజా వార్తలు

తెలంగాణలోని జోగులాంబ గద్వాల జిల్లాలోని జూరాల జలాశయంలో భారీగా వరదనీరు చేరుతోంది. ఎగువనున్న మహారాష్ట్ర, కర్ణాటక ప్రాంతాల్లో అధికంగా వర్షాలు కురవటంతో జూరాల ప్రాజెక్టు ఇన్‌ఫ్లో పెరిగింది. జలాశయం పూర్తి స్థాయి నీటి నిల్వ 9.65 టీఎంసీలు కాగా... ప్రస్తుత నీటి నిల్వ 6.17 టీఎంసీలుగా ఉంది.

jurala reservoir
జూరాల జలాశయానికి భారీగా వరదనీరు
author img

By

Published : Jun 25, 2021, 9:46 PM IST

ఎగువన కురుస్తున్న వర్షాలతో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. తెలంగాణలోని జోగులాంబ గద్వాల జిల్లాలోని జూరాల జలాశయానికి భారీగా వరదనీరు వచ్చి చేరుతోంది. ఎగువనున్న మహారాష్ట్ర, కర్ణాటక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఫలితంగా కర్ణాటకలోని ప్రాజెక్టులు నిండి.. జురాల వైపు వస్తున్నాయి. జూరాల ప్రాజెక్టు ఇన్‌ఫ్లో 38,200 క్యూసెక్కులు, ఔట్‌ఫ్లో 14 వేల క్యూసెక్కులుగా ఉంది. ప్రాజెక్టులో ప్రస్తుత నీటిమట్టం 1,038 అడుగుల వద్ద ఉంది. వరద ప్రవాహం పెరగడం వల్ల అధికారులు అప్రమత్తమవుతున్నారు.

జూరాల పూర్తిస్థాయి నీటిమట్టం 1,045 అడుగులు. జలాశయం పూర్తి స్థాయి నీటి నిల్వ 9.65 టీఎంసీలు కాగా.. ప్రస్తుత నీటి నిల్వ 6.17 టీఎంసీలుగా ఉంది. కర్ణాటక ప్రాంతంలో ఉన్న అలమట్టి ప్రాజెక్టు నుంటి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఆ నీరంతా నారాయణపూర్​ జలాశయం మీదుగా జూరాలకు చేరుతోంది.

జూరాలకు జలకళతో రైతన్నలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఈ ప్రాజెక్టు ఆయకట్టు కింద వందలాది ఎకరాలు సాగవుతుండగా.. పూర్తిస్థాయి నీరు చేరితే మరింత మంది రైతన్నలకు మేలు జరగనుంది. అదే సమయంలో వరద ప్రవాహం పెరుగుతుండడంపై అధికారులు అప్రమత్తమయ్యారు. రానున్న రోజుల్లో ఇన్​ఫ్లో పెరిగితే.. దిగువకు విడుదల చేసే నీటి సామర్ధ్యం కూడా ఎక్కువగా ఉండనున్న నేపథ్యంలో ప్రభావిత ప్రాంతాలను అధికారులు అలర్ట్​ చేస్తున్నారు.

ఇదీ చూడండి: Peddi Reddy: తెలంగాణ మంత్రుల మాటలు సరికాదు: పెద్దిరెడ్డి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.