పోలవరం పూర్తి ఖర్చును కేంద్రమే భరించాలని కేవీపీ రామచంద్రరావు వేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై హైకోర్టు విచారణ జరిపింది. ఈ వ్యాజ్యాన్ని సుప్రీం కోర్టుకు బదిలీ చేయాలని కోరుతూ... ఇప్పటికే కేంద్రం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉండగా హైకోర్టులో వాదనలు ఎలా జరపాలని పిటిషనర్ తరఫు న్యాయవాదిని ధర్మాసనం ప్రశ్నించింది. తాను వేసిన పిటిషన్‌కు సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉన్న పిటిషన్‌కు వ్యత్యాసం ఉందని పిటిషనర్ తరఫు న్యాయవాది వివరించారు. పూర్తి వివరాలతో అదనపు ప్రమాణపత్రాన్ని సమర్పించాలని పిటిషనర్ తరఫు న్యాయవాదిని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది.
ఇదీ చదవండి: