తెలంగాణలో నూతన రెవెన్యూ ట్రైబ్యునళ్లపై విచారణ జరిపిన హైకోర్టు.. 20 రోజుల్లో వివాదం ఎలా పరిష్కరిస్తారో తెలుసుకోవాలని ఉందని వ్యాఖ్యానించింది. ఇరుపక్షాల వాదనలు వినకుండా వివాద పరిష్కారం సరికాదని పిటిషనర్ హైకోర్టు దృష్టికి తెచ్చారు. దీనిపై స్పందించిన ఉన్నత న్యాయస్థానం.. సహజ న్యాయసూత్రాలను అమలు చేయాలి కదా అని పేర్కొంది.
ప్రభుత్వ వివరణ తెలుసుకుని చెబుతామని అడ్వకేట్ జనరల్ తెలపగా.. రెనెన్యూ ట్రైబ్యునళ్లపై విచారణను హైకోర్టు మార్చి 2కు వాయిదా వేసింది.
- ఇదీ చూడండి: