స్టేట్ డెవలప్మెంట్ కార్పొరేషన్‌ను ఏర్పాటు చేసి, రుణాలు తీసుకోవటంపై కన్నెగంటి హిమబిందు అనే మహిళ దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు విచారణ జరిపింది. రిజర్వ్ బ్యాంక్ నిబంధనల ప్రకారం ఇటువంటి కార్పొరేషన్లు ఏర్పాటు చేసేందుకు వీలులేదని పిటిషనర్ తరఫు న్యాయవాది నళినీ కుమార్ వాదనలు వినిపించారు. గతంలో వేసిన పిటిషన్, తాజా పిటిషన్‌లోని అంశాలు వేర్వేరు అని ధర్మాసనానికి వివరించారు. ఈ పిటిషన్‌కు విచారణ అర్హత లేదని ప్రభుత్వం తరఫున... సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది దుష్యంత్ దవే వాదించారు. ఇదే అంశంపై న్యాయవాది వై.బాలాజీ వేసిన పిటిషన్ ఈనెల 18 న విచారణకు రానుండటంతో.. రెండింటిని కలిపి విచారిస్తామని ధర్మాసనం తెలిపింది. తదుపరి విచారణను ఈనెల 18 వ తేదీకి వాయిదా వేసింది.
ఇదీచదవండి.