ఎంపీ రఘురామకృష్ణరాజుపై పోలీసుల దాడి అమానవీయం, దుర్మార్గమని మాజీ శాసనసభ్యులు జీవీ ఆంజనేయులు మండిపడ్డారు. సీఎంను సంతోష పెట్టడానికి సీబీసీఐడీ చేసిన పని అనాగరికమని దుయ్యబట్టారు. కక్షసాధింపు చర్యలతో ప్రజాస్వామ్య విలువలను తుంగలో తొక్కుతున్నారని విమర్శించారు. ఎంపీ స్థాయి వ్యక్తికే ఇలాంటి పరిస్థితి ఎదురైతే సామాన్యుల పరిస్థితి ఏమిటి అని జీవీ నిలదీశారు.
ఇటువంటి చర్యలకు భవిష్యత్ లో ప్రజలే గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. మీడియాపై కేసులు పెట్టే హక్కు ప్రభుత్వానికి ఎవరిచ్చారని ప్రశ్నించారు. లోటుపాట్లు సరిదిద్దుకోవాలని చెబితే కేసులతో వేధిస్తారా అని జీవీ ఆగ్రహం వ్యక్తం చేశారు. సమస్యల నుంచి తప్పుదారి పట్టించేందుకు ప్రజాప్రతినిధులపై దాడులని విమర్శించారు. ఎంపీపై లాఠీఛార్జికి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి:
ఎంపీ రఘురామ కేసులో రోజంతా హైడ్రామా.. గాయాలపై హైకోర్టు ఆగ్రహం