తెలంగాణ.. సిద్దిపేట జిల్లా తోగుట మండలంలోని గోవర్ధనగిరి, వరదరాజుపల్లి, ఘనాపూర్లో మొక్కజొన్న మిడతలు పంజా విసురుతున్నాయి. కేవలం రెండు రోజుల్లోనే వందల ఎకరాల మొక్కజొన్న పంట నాశనం చేశాయి. పరిస్థితిని గుర్తించి.. అప్రమత్తమైన వ్యవసాయశాఖ.. ఆచార్య జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తల బృందం క్షేత్రస్థాయిలో పర్యటించారు. వివిధ గ్రామాల్లో పంట పొలాలు పరిశీలించారు. మిడతల నమూనాలు, రైతుల నుంచి వివరాలు సేకరించారు. మిడతల గుంపు దాడి వల్ల పూర్తిగా నష్టపోయామని.. పరిహారం ఇచ్చి తమను ఆదుకోవాలని కర్షకులు అధికారులకు విజ్ఞప్తి చేశారు.
మొక్కజొన్నకు మిడతల గండం
మొక్కజొన్న రైతును నిన్నటి వరకు కత్తెర పురుగు కలవర పెట్టగా.. తాజాగా మిడతలు అన్నదాతకు కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాయి. లక్షల సంఖ్యలో మిడతలు చేనుపై వాలి... చూస్తుండగానే నామరూపాలు లేకుండా చేస్తున్నాయి.