రాష్ట్రంలో కేబినెట్ హోదా కలిగిన ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ సలహాదారులకు కంప్యూటర్ కొనుగోలుకు నగదు మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఉపముఖ్యమంత్రి నారాయణ స్వామి, హోం మంత్రి సుచరిత, ప్రెస్ ఆకాడెమీ ఛైర్మన్ దేవిరెడ్డి శ్రీనాధ్, అరబ్ దేశాల ఏపీ ప్రత్యేక ప్రతినిధి జుల్ఫీ రావ్జీ, సమన్వయ సలహాదారు సాగి దుర్గా ప్రసాద్ రాజు, పెట్టుబడుల ప్రోత్సాహక సలహాదారు పీటర్ టి.హాసన్‌కు రూ.25 వేల రూపాయల చొప్పున గ్రాంట్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.
రాష్ట్ర ప్రభుత్వం నియమించిన కేబినెట్ హోదా కలిగిన సలహాదారులు, నిపుణులకు కంప్యూటర్ కొనుగోలుకు గ్రాంటుగా రూ.25 వేలు, రుణంగా మరో రూ.25 వేల మంజూరికి అర్హులని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కోంది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ ఉత్తర్వులు ఇచ్చారు.
ఇదీ చదవండి: ప్రభుత్వమే లే అవుట్లను అభివృద్ధి చేసి ఇవ్వాలి: సీఎం జగన్