బాలలపై లైంగిక వేధింపుల కేసుల విచారణ త్వరగా పూర్తయ్యేలా రాష్ట్ర వ్యాప్తంగా 8 జిల్లాల్లో ప్రత్యేక కోర్టులు మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం, విశాఖ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఇవి ఏర్పాటు కానున్నాయి. పోక్సో చట్టం ప్రకారం త్వరితగతిన విచారణ చేపట్టేలా ప్రత్యేక న్యాయస్థానాలు ఏర్పాటు చేయాలన్న సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సర్కారు ఈ దిశగా నిర్ణయం తీసుకుంది. విశాఖ, గుంటూరు, ఉభయ గోదావరి జిల్లాల్లో ఈ మేరకు అధికంగా ఉన్న కేసులు.. త్వరితగతిన విచారణ పూర్తి చేసుకునే అవకాశం ఏర్పడింది.
ఇదీ చూడండి: