పట్టణ ప్రాంతాల్లో అనధికార లేఅవుట్ల క్రమబద్దీకరణ దరఖాస్తుల పరిష్కారానికి గడువును 2022 మార్చి 31 తేదీ వరకూ ప్రభుత్వం పొడిగించింది. ఈమేరకు పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వై.శ్రీలక్ష్మి శాఖాపరమైన ఆదేశాలను జారీ చేశారు. 2020 ఎల్ఆర్ఎస్ పథకంలో భాగంగా 2021 సెప్టెంబరు 31 తేదీలోగా అందుకున్న క్రమబద్దీకరణ దరఖాస్తులను పరిష్కరించేందుకు గడువు పెంచుతూ పురపాలక శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం టౌన్ ప్లానింగ్ సిబ్బంది అగ్రిగోల్డ్ భూముల్లో జగనన్న స్మార్ట్ టౌన్లు, పేదలందరికీ ఇళ్లు కార్యక్రమాల్లో నిమగ్నమైనందున అక్రమ లేఅవుట్ల క్రమబద్దీకరణ దరఖాస్తుల పరిశీలన ఆలస్యం అవుతున్నట్టు పురపాలక శాఖ పేర్కొంది. ఎల్ఆర్ఎస్ 2020 పథకంలో భాగంగా అక్రమ లేఅవుట్ల క్రమబద్దీకరణకు గడువు ముగిసే నాటికి 43,753 దరఖాస్తులు వచ్చినట్టు తెలియచేసింది. ఇప్పటి వరకూ అందులో 14,218 దరఖాస్తులు మాత్రమే పరిష్కరించగలిగినట్టు వెల్లడించింది. ఈ దరఖాస్తులను వేగంగా పరిష్కరించేందుకు నిర్దేశిత ప్రామాణిక విధానాన్ని పాటించాలని సూచిస్తూ అంతర్గత ఆదేశాలు జారీ అయ్యాయి.
ఇదీ చదవండి: ప్రముఖ నటుడు విజయ్ సేతుపతిపై దాడి