హైకోర్టు ఆదేశాల మేరకు తెలంగాణ ప్రభుత్వం బాణసంచాపై నిషేధం విధించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. టపాసులు విక్రయం, వినియోగించొద్దని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
రాష్ట్రంలో ఎక్కడ కూడా దుకాణాల్లో, ఇతర చోట్ల బాణసంచా విక్రయించకుండా చూడాలని డీజీపీ, అగ్నిమాపక శాఖ డైరెక్టర్ జనరల్‌తోపాటు అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలకు ఆదేశాలు జారీ చేశారు. పర్యావరణ కాలుష్యాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రజలు బాణసంచా కాల్చొద్దని ప్రభుత్వం కోరింది. బాణసంచా విక్రయ, వినియోగం విషయంలో తీసుకున్న చర్యల వివరాలను ఈనెల 16న ప్రభుత్వానికి అందించాలని సోమేశ్‌కుమార్ ఆదేశించారు.
ఇదీ చూడండి :
గాడి తప్పిన ‘ఫాస్టాగ్’ వరుసల నిర్వహణ...టోల్‌గేట్ల వద్ద తప్పని నిరీక్షణ