ETV Bharat / city

గౌతమ్‌రెడ్డి శాఖలు ఎవరికి? - ap minister goutham reddy portfolio

ఐటీ, పరిశ్రమలు-వాణిజ్యం, పెట్టుబడులు మౌలిక వసతులు, చేనేత జౌళి, నైపుణ్యాభివృద్ధి శిక్షణ శాఖల బాధ్యతలను గౌతమ్‌ నిర్వర్తించేవారు. ఆయన హఠాన్మరణంతో ఇంతకాలం ఆయన బాధ్యతలు నిర్వర్తించిన శాఖలు ఇప్పుడు ఎవరికి ఇవ్వనున్నారనేది చర్చనీయాంశమైంది.

goutham reddy portfolio
goutham reddy portfolio
author img

By

Published : Feb 27, 2022, 8:26 AM IST

మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి హఠాన్మరణంతో ఇంతకాలం ఆయన బాధ్యతలు నిర్వర్తించిన శాఖలు ఇప్పుడు ఎవరికి ఇవ్వనున్నారనేది చర్చనీయాంశమైంది. ఐటీ, పరిశ్రమలు-వాణిజ్యం, పెట్టుబడులు మౌలిక వసతులు, చేనేత జౌళి, నైపుణ్యాభివృద్ధి శిక్షణ శాఖల బాధ్యతలను గౌతమ్‌ నిర్వర్తించేవారు. ఇప్పుడీ శాఖల బదలాయింపు విషయంలో రెండు ప్రతిపాదనలు ప్రభుత్వ పరిశీలనలో ఉన్నట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఈ శాఖలను వేరే మంత్రులకు బదలాయించడం లేదా కొద్దికాలం వీటిని సీఎం వద్దే ఉంచి త్వరలో మంత్రివర్గ పునర్‌వ్యవస్థీకరణ సమయంలో ఇతర మంత్రులకు సర్దుబాటు చేయడమనేదే ఈ ప్రతిపాదనల సారాంశమని అంటున్నారు. ఇప్పుడే బదలాయిస్తే 5 శాఖలనూ ఒకరికేనా లేదా వేర్వేరు మంత్రులకు కేటాయిస్తారా? అనే అంశంపై స్పష్టత రావాల్సి ఉంది. ప్రస్తుత మంత్రుల్లో బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, బొత్స సత్యనారాయణ, ఆదిమూలపు సురేష్‌లకు గౌతమ్‌ చూసిన శాఖలను పంచే అవకాశం ఉందన్న చర్చ వైకాపా వర్గాల్లో జరుగుతోంది. మార్చి రెండో వారంలో అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభమవనున్నందున అంతకంటే ముందుగానే ఈ శాఖల బాధ్యులను ఖరారు చేయనున్నారని అంటున్నారు.

ఇదీ చదవండి: Telugu students in Ukraine : 'తెలుగు విద్యార్థులు సరిహద్దులకు రావద్దు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.