గోదావరి నదీ యాజమాన్య బోర్డు ఉపసంఘం (Godavari River Ownership Board Subcommittee Meeting) సమావేశమైంది. హైదరాబాద్‌లోని జలసౌధలో జీఆర్‌ఎంబీ ఉపసంఘం భేటీ (grmb subcommittee meeting) అయింది. బోర్డు సభ్యకార్యదర్శి బీపీ పాండే నేతృత్వంలో సమావేశమయ్యారు. సమావేశంలో బోర్డు సభ్యులు, ఇరు రాష్ట్రాల అధికారులు పాల్గొన్నారు. గెజిట్ నోటిఫికేషన్ అమలు కార్యాచరణపై చర్చిస్తున్నారు.
ఉపసంఘం ఏర్పాటు..
కేంద్రం జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్ అమలు ప్రక్రియ కోసం ఇదివరకే గోదావరి నదీ యాజమాన్య బోర్డు ఉపసంఘాన్ని ఏర్పాటు చేసింది. ఇటీవల జరిగిన జీఆర్ఎంబీ, కేఆర్ఎంబీ(KRMB) సంయుక్త సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు గతంలో ఏర్పాటు చేసిన సమన్వయ కమిటీ స్థానంలో ఉపసంఘాన్ని ఏర్పాటు చేశారు. బోర్డు మీటింగ్ మినిట్స్‌తో పాటు ఉపసంఘాన్ని ప్రకటించారు. గోదావరి నదీ యాజమాన్య బోర్డు సభ్య కార్యదర్శి ఉపసంఘానికి కన్వీనర్‌గా వ్యవహరిస్తారు. గెజిట్ నోటిఫికేషన్ అమలుపై ఉపసంఘం ఎప్పటికప్పుడు చర్చించుకోవాల్సి ఉంటుందని తెలిపారు.
ఇదీ చదవండి: FLOODS: గోదావరిలో మరింత పెరుగుతున్న వరద