గుంటూరు జిల్లా నిడుబ్రోలులో 1900 సంవత్సరం నవంబరు 7న గోగినేని నాగయ్య(gogineni nagaiah), అచ్చమాంబ(achamamba) దంపతులకు ఎన్జీ రంగా జన్మించారు. నిడుబ్రోలు(nidubrolu)లో ప్రాథమిక విద్య పూర్తిచేసిన ఆయన... గుంటూరు ఆంధ్ర క్రిస్టియన్ కళాశాల నుంచి డిగ్రీ పట్టా పొందారు. 1926లో ఆక్స్‌ఫర్డ్ వర్శిటీ నుంచి ఆర్థిక శాస్త్రంలో బీ-లిట్(B-lit) పొందారు. స్వదేశానికి తిరిగి వచ్చి మద్రాసు పచ్చయప్ప కళాశాలలో ఆర్థికశాస్త్ర ఆచార్యునిగా ఉద్యోగ జీవితం ప్రారంభించారు. కందుకూరి వీరేశలింగం జీవితం, దక్షిణాఫ్రికాలో గాంధీజీ సాగించిన పోరాటం.. రంగాను దేశ సేవకు పురిగొల్పింది. 1923లో అప్పికట్లలో రైతు మహాసభ, నిడుబ్రోలులో రైతు కూలీ మహాసభ(raithu koolee mahasabha) ద్వారా రంగా తన ప్రస్థానం ప్రారంభించారు. 'రామనీడు'(ramaneedu) పేరుతో రాజకీయ పాఠశాలను..., 1929లో ఆంధ్ర రాష్ట్ర రైతు సంఘాన్ని స్థాపించారు. కృష్ణా జిల్లాలో 300 గ్రామాల్లో రైతు సంఘాలు ఏర్పాటు చేశారు.
మహాత్మాగాంధీ పిలుపుతో...
1930లో గాంధీ పిలుపుతో... భారత స్వాతంత్య్ర ఉద్యమం వైపు అడుగేసిన రంగా... ఖద్దరు కట్టి గాంధీ టోపీ పెట్టారు. రైతు ఉద్యమాలను స్వాతంత్య్ర పోరాటం(freedom fight)లో భాగం చేశారు. తన భార్య భారతీ దేవితో కలసి సత్యాగ్రహ ఉద్యమాల్లోకి దిగారు. రైతు కూలీ ఉద్యమానికి నేతృత్వం వహించారు. రంగా కృషితో గుంటూరు జిల్లాలో 65 వేల ఎకరాలు సాగులోకి వచ్చాయి. కిసాన్ కాంగ్రెస్ పార్టీ(kisan congress party)ని స్థాపించిన రంగా.... రైతు కూలీల పరిస్థితిపై గాంధీతో చరిత్రాత్మక చర్చలు జరిపారు. ఈ చర్చల సారాంశంతో బాపు దీవెనలు పుస్తకాన్ని తీసుకొచ్చారు. 'వాహిని'(vahini) వార పత్రిక తెచ్చారు. ఇచ్ఛాపురం నుంచి మద్రాసు వరకు 4 నెలలు పాదయాత్ర చేసి రైతుల్లో చైతన్యస్ఫూర్తిని రగిలించారు. 1940లో మద్రాసులో శాసనోల్లంఘన చేసి ఏడాది పాటు జైల్లో ఉన్నారు. 1941లో క్విట్‌ఇండియా ఉద్యమంలో పాల్గొని మళ్లీ జైలుకెళ్లారు.
గిన్నిస్ రికార్డు...
రంగాకు ఆప్తమిత్రులు ఎందరో ఉన్నా... టంగుటూరి ప్రకాశం పంతులు(tanguturi prakasam panthulu)తో స్నేహం, గౌతు లచ్చన్నతో అనుబంధం కీలకమైనవి. గౌతు లచ్చన్న(gouthu lachanna), ఎన్జీ రంగా ఒకటే ఆత్మగా మెలిగారు. అంబేడ్కర్‌ని రాజ్యాంగ సభకు అధ్యక్షుడిగా ప్రతిపాదించింది రంగానే. 1952లో కాంగ్రెస్ పార్టీ నుంచి నిష్క్రమించిన రంగా... స్వతంత్ర పార్టీని స్థాపించి... పదేళ్లపాటు అధ్యక్షుడిగా పనిచేశారు. 1962 సార్వత్రిక ఎన్నికల్లో స్వతంత్ర పార్టీ 25 స్థానాల్లో గెలిచి... బలమైన ప్రతిపక్షంగా నిలిచింది. నాటి ప్రధాని నెహ్రూ రష్యా ముద్రగల సహకార వ్యవసాయాన్ని ప్రతిపాదించగా.. రంగా తీవ్రంగా వ్యతిరేకించారు. 1930 నుంచి 1991 మధ్యకాలంలో పార్లమెంటేరియన్‌గా ఐదు దశాబ్దాలపాటు సేవలందించిన రంగా... గిన్నిస్ బుక్‌లోకీ ఎక్కారు. ఉత్తేజిత ప్రసంగాలతో యువతకు స్ఫూర్తిగా నిలిచారు.
అన్నీ తానై...
దేశ రాజకీయాల్లో ఎన్జీ రంగా తనదైన ముద్ర వేశారు. సుభాష్ చంద్రబోస్ ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ(forward block party)కి ఆ పేరు పెట్టింది ఈయనే. త్రిపుర కాంగ్రెస్ సభల్లో నెహ్రూ - గాంధీల ద్వయం నేతాజీని ఒంటరి చేసినప్పుడు... నేతాజీకి బహిరంగంగా అండగా నిలిచి అన్నీ తానై త్రిపుర కాంగ్రెస్ మహాసభలను(thripura congress meeting) నడిపించారు. వివిధ విదేశీ సదస్సులకు హాజరయ్యారు. 1980లో ఐక్యరాజ్యసమితి సమావేశంలో భారత్ తరఫున ప్రతినిధిగా పాల్గొన్నారు. రంగా సమకాలీన అంశాలపై రచనలు చేశారు. ఆంగ్లంలో 65, తెలుగులో 15 పుస్తకాలు రాశారు. ఎందరినో ప్రజా నాయకులుగా తీర్చిదిద్దారు. గౌతులచ్చన్న, పాతూరి రాజగోపాలనాయుడు, జి.మునిరత్నం నాయుడు, పెద్దిరెడ్డి తిమ్మారెడ్డి, యడ్లపాటి వెంకట్రావుతో పాటు మాజీ ముఖ్యమంత్రులు చంద్రబాబునాయుడు, కొణిజేటి రోశయ్య... రంగా శిష్యులే.
గో భూమిలో తుదిశ్వాస...
రైతులకు రంగా చేసిన విశిష్ట సేవలను గుర్తిస్తూ... ఏపీ వ్యవసాయ విశ్వవిద్యాలయానికి(AP agriculture university) 1997లో 'ఆచార్య యన్.జి.రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం'గా పేరు పెట్టారు. ప్రభుత్వం రంగాకు పద్మవిభూషణ్(pama vibhushan) పురస్కారం ఇచ్చి గౌరవించింది. అనేక ఇతర పురస్కారాలూ దక్కాయి. తపాలాశాఖ ప్రత్యేక స్మారక బిళ్లను విడుదల చేసింది. 95 ఏళ్ల వయసులో అనారోగ్యంతో 1995 జూన్ 8న నిడుబ్రోలులోని స్వగృహమైన 'గోభూమి'(go-bhoomi)లో రంగా తుదిశ్వాస విడిచారు. వీరికి సంతానం లేదు. సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఎలాంటి పదవులు ఆశించకుండా.. నీతివంతమైన.. నిరాడంబర జీవితం గడిపిన ఎన్జీ రంగా భావితరాలకు ఆదర్శ ప్రాయుడు.. మార్గదర్శి.
ఇవీచదవండి.
- దుర్గమ్మ సేవలో.. హైకోర్టు సీజే జస్టిస్ గోస్వామి దంపతులు
- Bharat Biotech: మలేరియాకు భారత్ బయోటెక్ టీకా.. జీఎస్కే భాగస్వామ్యంతో..
- Fraud: వట్టిచెరుకూరులో పేదల ఇళ్ల నిర్మాణం పేరిట.. సిటిజన్ సంస్థ మోసం!
- హైవేపై ఏనుగు హల్చల్- వాహనాన్ని అడ్డగించి..
- ఫేవరెట్లుగా ధోనీసేన.. దిల్లీ కుర్రాళ్లు ఢీకొట్టగలరా?
- బోటు ప్రమాదంలో 100 మంది మృతి!