ప్రముఖ సీనియర్ న్యాయవాది, ఆంధ్రప్రదేశ్ మాజీ అడ్వకేట్ జనరల్ ఎస్. రామచంద్రరావు గుండెపోటుతో మృతి చెందారు. 1947 సెప్టెంబర్ 1న జన్మించిన ఆయన... ఆంధ్రాయానివర్సిటీలో డిగ్రీ పూర్తి చేశారు. మద్రాస్ లా విశ్వవిద్యాలయం నుంచి పట్టా పొందారు. సుప్రీం, హైకోర్టులో సీనియర్ న్యాయవాదిగా సేవలు అందించారు.
సుప్రీంకోర్టు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఎన్నో సంచలన కేసులను ఆయన వాదించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని ప్రొఫెషనల్ కాలేజీల్లో క్యాపిటేషన్ ఫీజును విజయవంతంగా సవాలు చేసి విద్యార్థులకు న్యాయం జరిగేలా చూశారు. తితిదే దేవస్థానానికి దాతల నుంచి వచ్చే సొమ్మును పక్క దారి పట్టకుండా న్యాయపరంగా కీలకంగా వ్యవహరించారు. ప్రజా ప్రయోజనాల కేసుల్లో వారికి న్యాయం జరిగేలా తీవ్రంగా కృషి చేశారు. ఆయన మృతి పట్లు పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.