తెలంగాణలోని సంగారెడ్డి జిల్లాలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. జిన్నారం మండలం కాజిపల్లి పారిశ్రామికవాడలోని లీ పరిశ్రమకు చెందిన రసాయన గోదాంలో ఈ ప్రమాదం (fire accident) జరిగింది. రసాయనాలు మండి అగ్నికీలలు ఎగిసిపడటంతో పాటు భారీగా పొగ అలుముకుంది.
ప్రమాదం జరిగిన వెంటనే స్థానికంగా ఉన్న ఓ పరిశ్రమకు చెందిన అగ్నిమాపక యంత్రం, నీటి ట్యాంకర్లు ఘటన స్థలానికి చేరుకుని.. మంటలు ఆర్పే ప్రయత్నం చేశాయి. గోదాం కావడంతో ఉద్యోగులు పరిమితంగా ఉన్నారు. దీంతో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. కేవలం ఆస్తి నష్టమే జరిగినట్లు అధికారులు చెబుతున్నారు.
ఇదీ చూడండి: