ETV Bharat / city

రాష్ట్రపతి దృష్టికి అమరావతి రైతుల ఆవేదన

author img

By

Published : Feb 8, 2020, 5:55 AM IST

అమరావతి ప్రాంత రైతుల ఆవేదన... రాష్ట్రపతి దృష్టికి చేరింది. రాష్ట్రపతి రామ్​నాథ్‌ కోవింద్‌ను కలిసి ఐకాస నేతలు సమస్యను వివరించారు. ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్‌ షాను కలిసేందుకు సన్నద్ధమవుతున్నారు. మంత్రులు సైతం ముఖ్యమంత్రిని ధిక్కరించే స్థాయికి రాజధాని ఉద్యమాన్ని తీసుకెళ్తామని అమరావతి మహిళలు సీఎం జగన్‌ను హెచ్చరించారు.

Farmers meets president
రాష్ట్రపతి దృష్టికి అమరావతి రైతుల ఆవేదన

రాష్ట్రపతి దృష్టికి అమరావతి రైతుల ఆవేదన

రాజధాని ప్రాంతంలో రైతుల మరణాలపై రాష్ట్రపతి రామ్​నాథ్‌ కోవింద్ విచారం వ్యక్తం చేశారని... అమరావతి పరిరక్షణ సమితి సభ్యులు తెలిపారు. దిల్లీలో దేశ ప్రథమ పౌరుడిని కలిసిన వారు... 3 రాజధానుల ప్రతిపాదనతో నెలకొన్న సంక్షోభం, భూములు త్యాగం చేసిన రైతుల పట్ల ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును వివరించారు. ఏపీ రాజధానిగా అమరావతే కొనసాగేలా తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. కేంద్రమంత్రి నితిన్ గడ్కరీని కలిసి అండగా నిలవాలని కోరారు. ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షాను ఇవాళ కలిసే అవకాశం ఉందని ఐకాస నేతలు తెలిపారు.

అమరావతిలో రైతుల ఆందోళనలు 53వ రోజూ ఉద్ధృతంగా కొనసాగాయి. రాయపూడిలో మహిళలు జలదీక్షలు చేసి పొంగళ్లు సమర్పించారు. తుళ్లూరు, రాయపూడి దీక్షా శిబిరాల్లో ముస్లింలు మత ప్రార్థనలు నిర్వహించారు. శాసనమండలి ఛైర్మన్ షరీఫ్ రైతుల పక్షాన నిలబడ్డారంటూ ముస్లిం పెద్దలకు రాయపుడిలో సన్మానం చేశారు. వెలగపూడిలో ఇద్దరు యువకులు 151 గంటల నిరాహార దీక్ష చేపట్టారు. మహిళలు మందడం నుంచి భారీ ర్యాలీగా వెలగపూడి చేరుకుని రైతులకు సంఘీభావం తెలిపారు. అమరావతి విద్యార్థి ఐకాస ఉద్యమ కార్యాచరణకు సంబంధించి గోడ ప్రతులు విడుదల చేసింది.

పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడి మండలానికి చెందిన 20మంది మహిళలు అమరావతినే రాజధానిగా కొనసాగించాలంటూ... ద్వారకా తిరుమల దేవస్థానానికి పాదయాత్ర చేశారు. పట్టణంలోని ఆంజనేయ స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం కాలినడకన వారు ద్వారకా తిరుమల బయలుదేరారు.

ఇదీ చదవండీ... అమరావతి కోసం దర్గా వద్ద పొంగళ్లు పెట్టిన ముస్లిం మహిళలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.